సురేష్ కొండేటి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీనియర్ సినిమా జర్నలిస్టు సంతోషం మ్యాగ్జిన్ యజమాని నిర్మాత సురేష్ కొండేటికీ అన్ని దారులు కూడా క్లోజ్ అయిపోయినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఎన్నో ఏళ్ల నుండి కూడా సురేష్ సంతోషం అవార్డ్స్ పేరుతో తెలుగుతో పాటుగా తమిళ, మలయాళ, కన్నడ నటి నటులు అలానే సాంకేతిక నిపుణులకు అవార్డులను ఇస్తున్నారు. ఈ ఏడాది చేసిన తప్పు వలన తన పేరు అంతా కూడా పోయిందని తెలుస్తోంది. సంతోషం అవార్డ్స్ ఫంక్షన్ ని ఆయన గోవాలో నిర్వహించారు తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద మచ్చ కూడా పడింది.
Advertisement
అసలు ఏమైందనే విషయానికి వచ్చేస్తే… గోవాలో నిర్వహించిన ఈ అవార్డు ఫంక్షన్ కి నాలుగు దక్షిణాది భాషల నుండి వచ్చిన నటులు అలానే సాంకేతిక నిపుణులు అందరికీ సౌకర్యాన్ని కల్పించడంలో ఆయన విఫలమయ్యారు. అంతమంది రావడంతో సర్దుబాటు చేయలేకపోయారు. కన్నడ సెలబ్రిటీల నుండి విమర్శలు వచ్చాయి తమని ఉంచిన హోటల్స్ కి రూమ్ బిల్స్ కూడా చెల్లించలేదని దాంతో రూములని ఖాళీ చేయించారని కన్నడ సెలబ్రెటీలు చెప్పడం జరిగింది. పైగా అవార్డులను ఇచ్చే విషయంలో కనడ సినీ నటులని అవమానించారని, ఒక మహిళ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు.
Advertisement
ఈ అవార్డు ఫంక్షన్ మధ్యలోనే ఆయన బయటికి వెళ్లిపోయినట్లు తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటనలో చెప్పింది. నిర్మాత దామోదర ప్రసాద్ సొంత ఖర్చులతో కొంతమంది సెలబ్రిటీలని హోటల్ నుండి ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లారట మొత్తం మీద సురేష్ కొండేటి చేసిన పని వలన కన్నడ వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమని తిట్టడం మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవికి సురేష్ కొండేటి పిఆర్ ఓ అని ప్రచారం కూడా సాగింది. దీనిపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా స్పందించారు చిరంజీవికి పిఆర్ఓ కాదని చెప్పారు ఇది ఒక ప్రైవేట్ ఫంక్షన్ అని, దీనికి తెలుగు సినిమా పరిశ్రమ కి సంబంధం లేదని చెప్పారు. తెలుగు సినీ విమర్శకుల సంఘం అధ్యక్షుడు పదవి నుండి కూడా ఆయనని తొలగిస్తూ నిన్న ఈసీ నిర్ణయం తీసుకుంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!