Home » నన్ను ఒప్పుకోరని తెలుసు అంటూ.. తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అవుతూ చెప్పిన నిజాలివే..!

నన్ను ఒప్పుకోరని తెలుసు అంటూ.. తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి ఎమోషనల్ అవుతూ చెప్పిన నిజాలివే..!

by Sravya
Ad

నందమూరి తారక రామారావు మనవడు తారకరత్న తాత లానే పేరు తెచ్చుకోవాలని ఇండస్ట్రీకి వచ్చారు. కానీ అంతలా కెరియర్ లో సక్సెస్ కాలేకపోయారు. ఎన్టీఆర్ మనవడిగా నందమూరి మోహన్ కృష్ణ తనయుడుగా తారకరత్న 20 ఏళ్ళు వయసులోనే ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా చేశాడు. తారకరత్నకి తెలిసిన స్నేహితుల ద్వారా అలేఖ్య రెడ్డి ఆయనకి పరిచయమైంది. ఆమె పలు సినిమాలకి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించారు తనతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇలా ఒకరినొకరు ఇష్టపడ్డారు తారక్ సినిమా నందికేశ్వరుడు అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.

Advertisement

కానీ వీరు ప్రేమను ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు దానికి కారణం ఏంటంటే అలేఖ్యకి ఇదివరకే పెళ్లి అయ్యి విడాకులు అయిపోవడం. అయినా కూడా తారకరత్న వెనక్కి తగ్గలేదు 2012లో ఒక గుడిలో తనని పెళ్లి చేసుకున్నారు. తర్వాత కొంతకాలానికి ఇద్దరి కుటుంబాలు కూడా దగ్గరయ్యాయి. 2013లో వీళ్ళ ప్రేమకి గుర్తుగా నిషిక అనే పాప పుట్టింది పాప పుట్టాక అలేఖ్య రెడ్డి కెరీర్ ని పక్కన పెట్టేసి పాపని చూసుకోవడం మొదలుపెట్టారు. కానీ ఇలా తారకరత్న అర్ధాంతరంగా చనిపోవడం బాధాకరం. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవరు కూడా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోలేదు.

Advertisement

అందరూ కూడా పెద్దలకు చేసుకున్నారు తారకరత్న జంట మాత్రమే ప్రేమ వివాహం చేసుకుంది. అందుకే ముందు పెళ్లికి ఒప్పుకోలేదు ఎన్టీఆర్ ఫ్యామిలీ. అందులోనూ అలేఖ్య రెడ్డి విడాకులు తీసుకోవడం అసలు నచ్చి ఉండదు అందుకనే వీళ్ళ పెళ్ళికి ఒప్పుకుని ఉండరు. వీళ్ళ లవ్ మ్యారేజ్ కి విజయ్ సాయి రెడ్డి ఒకరు మాత్రమే సపోర్ట్ చేశారు ఇంకెవరు కూడా వీళ్ళ ప్రేమ వివాహానికి సపోర్ట్ చేయలేదు. తారకరత్న పెళ్లి జరిగిన తర్వాత అలేఖ్య రెడ్డిని నువ్వే అదృష్టవంతురాలు నీకంటూ ఇద్దరు వచ్చారు మా కుటుంబం తరఫు నుండి ఎవరూ రాలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారట. ఈ విషయాలని తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఒక సందర్భంలో చెప్పారు ప్రస్తుతం ఆమె చెప్పిన విషయాలు వైరల్ గా మారాయి.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading