రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
Advertisement
వినూత్న దర్శకత్వ శైలితో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసే రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్న సినిమాతో వార్తల్లో నిలిచారు. గతంలో గొప్ప సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పొలిటికల్ సినిమాలు తీస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో “వ్యూహం” పేరిట ఓ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచే వార్తల్లో నిలిచింది.
ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగింది. ఈ ఈవెంట్ లో రామ్ గోపాల్ వర్మ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీని ఆధారంగా తీసుకుని తీస్తున్న సంగతి తెలిసిందే. రామదూత క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.
అహంకారానికి, ఆలోచనకు మధ్య జరిగే యుద్ధమే “వ్యూహం” అంటూ ఈ సినిమా గురించి ప్రకటించారు. ఈ సినిమాలో వై ఎస్ జగన్ పాత్రలో అజ్మల్ నటించగా.. వై ఎస్ భారతి పాత్రలో మానస నటించారు. రాజకీయ నాయకుల మధ్యన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా రూపొందించారు. డిసెంబర్ 29వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రిరిలీజ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా చేసారు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ రాజకీయాల్లో ఉన్న వారు బయట ఎలా కనిపిస్తారు? ఎలాంటి కుట్రలు చేస్తారు అనే విషయాన్నీ సైకోలాజికల్ కోణంలో చూపించానని తెలిపారు. కథ కంటే క్యారెక్టర్స్ కె ఈ సినిమాలో ఎక్కువ పాత్ర ఉంటుందని తెలిపారు. నేను రాజకీయాల్లో లేకున్నా రాజకీయ నాయకుల సైకాలజీని అర్ధం చేసుకుంటానని తెలిపారు. పవన్ లాంటి వ్యక్తి పొలిటికల్ పార్టీ పెట్టినపుడు ఇంప్రెస్స్ అయ్యానని.. కానీ, రాజకీయపరంగా ఆయన నిర్ణయాలు చూసి అభిమానం పోయిందన్నారు. పవన్ కొందరి చేతిలో కీలుబొమ్మగా మారారని.. వారు ఎలా చెప్తే అలా వినే బర్రెలా మారారన్నారు. తెలంగాణాలో బర్రెలక్కకు కనీసం స్వతంత్రంగా నిలబడే ధైర్యం ఉందని.. పవన్ కి అది లేదని అన్నారు. స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేని వ్యక్తి సూపర్ స్టార్ అంటూ ఎద్దేవా చేసారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!