యావత్ భారత దేశం సలార్ సినిమా కోసం ఉర్రూతలూగిపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి తరువాత ప్రభాస్ కు గట్టి హిట్ పడలేదు. దీనితో ఆయన అభిమానులంతా సలార్ పైనే ఆశలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమా తెరకెక్కింది. మరి కొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్లలో రికార్డ్స్ సృష్టించబోతోంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో సలార్ కు అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ఈ సినిమా రెండు పార్ట్స్ గా రూపొందిందన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ అంచనాలను మరింతగా పెంచింది.
Advertisement
ఈ ట్రైలర్ లోనే సినిమా కథలో ఉండే పాత్రలు, తీరు గురించి ప్రశాంత్ నీల్ ఇంట్రడక్షన్ ఇచ్చేసాడు. దీనితో ఈ సినిమాపై గట్టిగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సలార్ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.
కథ:
ఈ కథ మొత్తం ఖాన్సార్ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. రాజమన్నార్, దేవా అనే ఇద్దరు ఫ్రెండ్స్ తమ స్నేహం కోసం ఎలా ముందుకు వెళ్తారు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇది మొదటి పార్ట్. కెజిఎఫ్ తరహా లోనే ఖాన్సార్ సామ్రాజ్యానికి అధిపతి అవ్వాలని అంతా ట్రై చేస్తూ ఉంటారు. రాజమన్నార్ కూడా ప్రయత్నం చేసి ఓడిపోతాడు. అయితే.. అందులో గెలవడం కోసం తన స్నేహితుడైన దేవా సాయం కోరతాడు. రాజమన్నార్ ఓడిపోవడంతో పాటు దేవా ఎంట్రీ ని కూడా చాలా గొప్పగా చూపిస్తారు.
Advertisement
దేవా ఎంట్రీ నుంచి స్టోరీ చాల వేగంగా నడుస్తున్నట్లు అనిపిస్తుంది. తన ఫ్రెండ్ శత్రువులందరిని దేవా అడ్డుతొలగిస్తాడు. ఖాన్సార్ రాజమన్నార్ సొంతం అవుతుంది. ఈ రాజ్యం కోసమే రాజమన్నార్ తనని వాడుకుని మోసం చేసాడని దేవా తెలుసుకుంటాడు. దీనితో కథ మలుపు తిరుగుతుంది. దీనితో దేవా తన స్నేహితుడికి ఎలా బుద్ధి చెప్పాడు అనేదే స్టోరీ. ఖాన్సార్ ను దేవా ఎలా సొంతం చేసుకుంటాడు.. మోసాన్ని తెలుసుకున్న తరువాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనేది మిగిలిన స్టోరీ (రెండవ పార్ట్). ఇందులో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు కూడా చాలా బాగా ఆకట్టుకుంటాయి. శృతి హాసన్ పాత్ర కూడా కీలకమైనది. కథని మలుపు తిప్పే విధంగా ఉంటుంది. ఈ సినిమా చూసాక.. రెండవ పార్ట్ లో ఏమి జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొంటుంది.
ఫస్ట్ పార్ట్ కాస్ట్:
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, తిను ఆనంద్, ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రీయా రెడ్డి, రామచంద్రరాజు, మధు గురుస్వామి, సప్తగిరి, పృధ్వీ రాజ్, మహేశ్, నాగజీ, ఝాన్సీ, , దుబ్బాక భాస్కర్ రావు, జెమినీ సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్లస్ పాయింట్స్ :
ప్రభాస్ యాక్టింగ్
శృతి హాసన్
చివరి వరకు ఉత్కంఠగా అనిపించడం
ప్రశాంత్ నీల్ డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
చెప్పుకోదగ్గవి లేవు.
రేటింగ్: