ఇండియాలో చేసే సినిమాల్లో విలన్‌లకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దర్శకనిర్మాతల అభిప్రాయం ప్రకారం, సినిమాల్లో హీరోలకు ఉన్నంత ప్రాముఖ్యత విలన్లకు ఉంటుంది. కథాంశాన్ని బయటకు తీసుకురావడంలో మరియు హీరో పాత్రను హైలైట్ చేయడంలో విలన్ పాత్ర కీలకంగా ఉంటుంది. భారతదేశంలో హీరోల కంటే విలన్‌లు ఎక్కువ ప్రశంసలు పొందిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో, సినిమాలో విలన్ మరియు హీరో పాత్రలు పోషించిన నటుల గురించి చూద్దాం.
రజనీకాంత్:
Advertisement
రజనీకాంత్ భారతీయ సినిమాల్లో అతిపెద్ద సూపర్‌స్టార్‌లలో ఒకరు. అతను అనేక సూపర్‌హిట్ చిత్రాలలో నటించారు. ఆయనకు ఉన్న అభిమానుల సంఖ్య కూడా లెక్క లేదు. అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రాలలో ఒకటైన రోబోట్‌లో రజిని ద్విపాత్రాభినయం చేసారు. ఈ సినిమాలో హీరో గా, విలన్ గా రెండు పాత్రల్లోనూ రజినినే కనిపిస్తారు.
జూనియర్ ఎన్టీఆర్:
తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసిన మరో సూపర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్. ఆయన చాలా పెద్ద హిట్స్ కొట్టారు. RRR ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న తర్వాత ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2017లో జై లవకుశ అనే సినిమా చేసి టాలీవుడ్‌లో పెద్ద హిట్‌గా నిలిచింది. సినిమాలో నెగెటివ్ రోల్‌తో పాటు పాజిటివ్ రోల్‌లోనూ ఎన్టీఆర్ నటించారు.
వెంకటేష్:
నాగవల్లి సినిమాలో సైక్రియాట్రిస్టుగా హీరోలా నటించి, విలన్ అయిన రాజు పాత్ర లోనూ వెంకటేష్ నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.
గోపీచంద్:
గౌతమ్ నందా సినిమాలో గోపీచంద్ హీరోగా, విలన్ గా ఇరగదీశారనే చెప్పొచ్చు. థియేటర్స్ లో కంటే.. ఈ సినిమా టివి లో వచ్చిన తరువాత బాగా పాపులర్ అయింది.
బాలకృష్ణ:
సుల్తాన్ సినిమాలో బాలకృష్ణ హీరో మరియు విలన్ రోల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
చిరంజీవి:
చిరంజీవి మొదటగా ద్విపాత్రాభినయం చేసిన సినిమా నకిలీ మనిషి. హీరో కమ్ విలన్ గా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేసారు.
ఎన్టీఆర్:
Advertisement
సీనియర్ ఎన్టీఆర్ కూడా చాలా సినిమాల్లో హీరో కం విలన్ గా నటించారు. శ్రీకృష్ణసత్య, శ్రీమద్విరాట పర్వం, దాన వీర శూర కర్ణ, శ్రీరామపట్టాభిషేకం లాంటి సినిమాల్లో హీరోగా, విలన్ గా కనిపించారు.
అక్కినేని నాగేశ్వరరావు:
ఈయన కూడా అక్కాచెల్లెలు సినిమాలో హీరో కం విలన్ గా నటించి మెప్పించారు.
శోభన్ బాబు:
మొనగాడు,పొట్టి ప్లీడర్ లాంటి సినిమాల్లో శోభన్ బాబు కూడా హీరో కం విలన్ గా డబుల్ యాక్టింగ్ చేసారు.
సూపర్ స్టార్ కృష్ణ:
మానవుడు దానవుడు సినిమాలో కృష్ణ కూడా హీరోగా, విలన్ గా నటించారు.
కృష్ణం రాజు:
సింహ గర్జన సినిమాలో కృష్ణం రాజు హీరో కం విలన్ గా డ్యూయల్ రోల్ చేసారు.
ప్రభాస్:
బిల్లా సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో కం విలన్ గా కనిపించి మెప్పించారు.
సూర్య :
24 సినిమాలో త్రిబుల్ రోల్ చేసాడు సూర్య. తండ్రీకొడుకులుగా చేసిన సాఫ్ట్ రోల్ కంటే.. విలన్ గా కనిపించిన ఆత్రేయ రోల్ కి చాలా మంది అట్ట్రాక్ట్ అయ్యారు.
కార్తీ:
కాష్మోరా సినిమాలో కార్తీ హీరో కం విలన్ రోల్ లో నటించారు.
సుధీర్ బాబు:
‘మామ మశ్చీంద్ర’ సినిమాలో త్రిబుల్ రోల్ చేసాడు సుధీర్ బాబు. వీటిలో ఒకటి విలన్ రోల్ అయితే.. మరొకటి నార్మల్ పాత్ర. మరొకటి ఊబకాయం ఉన్న పాత్ర.
కళ్యాణ్ రామ్:
‘అమిగోస్’ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో నటించారు. వీటిల్లో ఒకటి విలన్ రోల్. మైఖేల్ అనే గ్యాంగ్ స్టర్ గా ఇరగదీసాడు.
మోహన్ బాబు:
ఎం.ధర్మరాజు ఎం.ఏ సినిమాలో మోహన్ బాబు డ్యూయల్ రోల్ లో నటించారు.
కమల్ హాసన్:
దశావతారం సినిమాలో కమల్ చాలా పాత్రల్లో నటించారు. అయితే ఈ సినిమాలో విలన్ రోల్ కూడా కమల్ హాసన్ నే నటించాడు.