అందర్నీ దర్శకుడు అంటే రాఘవేంద్రరావును మాత్రం దర్శకేంద్రుడు అని పిలుస్తుంటారు. దానికి కారణంగా ఆయన చేసిన సినిమాలే. వందకు పైగా చిత్రాలను తెరకెక్కించి ఎన్నో హిట్లు అందుకున్నాడు. ఇక అంతటి గొప్ప దర్శకుడి దగ్గర శిష్యరికం చేసిన దర్శకులు కూడా టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.
రాజమౌళి
రాజమౌళి రాఘవేంద్రరావు దగ్గర రెండు మూడు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. స్టూడెంట్ నంబర్ 1 సినిమాకు అవకాశం ఇప్పించింది కూడా దర్శకేంద్రుడే.
Advertisement
బీ .గోపాల్
Advertisement
యాక్షన్ సినిమాల దర్శకుడు బీగోపాల్ కూడా రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేశారు. అడవి రాముడు సినిమా నుండి బిగోపాల్ ఆయన దగ్గర పనిచేశాడు. ఆ తరవాత ప్రతిధ్వని సినిమాతో దర్శకుడిగా మారి సూపర్ హిట్ సినిమాలు తీశాడు.
వైవీఎస్ చౌదరి
వైవీఎస్ చౌదరి కూడా రాఘవేంద్రరావు స్కూల్ నుండే వచ్చాడు. పట్టాభిషేకం నుండి అన్నమయ్య సినిమాల వరకూ వైవీఎస్ రాఘవేంద్రరావు దగ్గర పనిచేశారు.
కోదండ రామిరెడ్డి
కోదండ రామిరెడ్డి మొదట రాఘవేంద్రరావు వద్దనే అసిస్టెంట్ దర్శకుడిగా పనిచేశాడు. ఆ తరవాత అద్భుతమైన సినిమాలు చేసి గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు.
Also Read: కోహ్లీ స్థానంలో నేను ఉంటే అనుష్కను పెళ్లి చేసుకోను.. అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు