Home » బచ్చన్ ఇంట్లో ఐశ్వర్యా రాయ్ ఉండట్లేదా..? ఆమె వెళ్లిపోయారా..?

బచ్చన్ ఇంట్లో ఐశ్వర్యా రాయ్ ఉండట్లేదా..? ఆమె వెళ్లిపోయారా..?

by Sravya
Ad

ఐశ్వర్యారాయ్ గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఐశ్వర్యరాయ్ తన భర్తతో విడిపోతుందని వార్తలు వస్తూనే వున్నాయి. త్వరలోనే వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటారంటూ పెద్ద ఎత్తున వార్తలైతే వచ్చాయి. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో విపరీతంగా షికార్లు కొడుతున్నాయి. తాజాగా ఐశ్వరరాయ్ బచ్చన్ ఇంటి నుండి బయటకు వచ్చిందని, తన భర్త నుండి వేరుగా ఉంటోందని వార్తలు అయితే విపరీతంగా షికార్లు కొడుతున్నాయి. ఐశ్వరరాయ్ తన పుట్టింటి వారి గురించి తన బిడ్డ ఆరాధ్య గురించి మాత్రమే ఆలోచిస్తోందని, వాళ్ల బాగోగుల గురించి మాత్రమే చూసుకుంటోంది అని అందరూ అంటున్నారు.

Advertisement

చాలా ఏళ్ళ నుండి ఐశ్వర్య, అభిషేక్ మధ్య సరిగ్గా నడవట్లేదని ఆ బిడ్డ కోసం ఇన్నాళ్లు కలిసి ఉన్నారని గాసిప్స్ వినపడుతున్నాయి ఇద్దరు మధ్య ఇప్పటికే సయోధ్య కుదరట్లేదని, ఇంట్లో అత్త కోడలు మధ్య కూడా పడట్లేదు అని విపరీతంగా వార్తలొచ్చాయి జాతీయ మీడియా లో అనేక వార్తలు మనకి కనబడుతున్నాయి. మరి వీటిలో నిజం ఎంత అనేది వాళ్ళ కుటుంబానికి మాత్రమే తెలియాలి.

Advertisement

మొన్న ఆ మధ్య అభిషేక్ బచ్చన్ నటించిన వెబ్ సిరీస్ స్పెషల్ ప్రీమియర్ లో బచ్చన్ ఫ్యామిలీ అంతా కనిపించారు అయితే ఐశ్వర్య, జయ బచ్చన్, అమితాబ్, అభిషేక్ అంతా సందడి చేశారు కానీ ఐశ్వర్య అభిషేక్ పక్క పక్కన నిలబడలేదు. అలానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోవట్లేదని కూడా అంతా చెప్పుకొచ్చారు. అత్త కోడలు, ఆడపడుచు అంటూ ఇలా ప్రతి ఇంట్లో కూడా సమస్యలు వుంటుంటాయి. అయితే ఫ్యామిలీ ని చూసుకుని మాత్రమే విడాకులు వరకు వెళ్లట్లేదని అర్థమవుతుంది ఐశ్వర్యరాయ్ మాత్రం ఇప్పుడు బచ్చన్ ఫ్యామిలీకి దూరంగా ఉంటోందట. వారి ఇంట్లోంచి బయటకు వెళ్లి సపరేట్ గా ఉంటోందట. మరి ఈ విషయంపై ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading