Home » శీతాకాలంలో పాలకూరను తీసుకోవచ్చా..? పాలకూరని తీసుకుంటే ఏం అవుతుంది..?

శీతాకాలంలో పాలకూరను తీసుకోవచ్చా..? పాలకూరని తీసుకుంటే ఏం అవుతుంది..?

by Sravya
Ad

చాలామంది ఆకుకూరలని, కూరగాయల్ని రెగ్యులర్ గా తీసుకుంటుంటారు చలికాలంలో అనేక వ్యాధులు సమస్యలు మనకి కలుగుతూ ఉంటాయి. శీతాకాలంలో అనేక రకాల సమస్యలు వస్తాయి కాబట్టి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. చలికాలంలో గ్యాస్, గుండెలో మంట వంటివి ఎక్కువ ఉంటాయి. ఈ కాలంలో, ఎక్కువగా నడకకి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అందుకు కారణం. ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన జీవన విధానాన్ని పాటించడంతో పాటుగా వ్యాయమంపై కూడా శ్రద్ధ పెట్టాలి. వాతావరణం చల్లగా ఉందని చాలా మంది నీళ్లు తక్కువ తీసుకుంటూ ఉంటారు. దీంతో జీర్ణక్రియ బాగుంటుంది. చలికాలంలో కారంగా ఉండేవి బయట ఫాస్ట్ ఫుడ్స్ వంటివి ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. దాంతో ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.

Advertisement

శీతాకాలంలో కూరగాయల్ని క్రమం తప్పకుండా తింటే బరువు కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అలానే పాలకూరని తప్పనిసరిగా తీసుకోవాలి. పాలకూరలో పోషకాలు బాగా ఎక్కువ ఉంటాయి క్యాల్షియం, ఐరన్ తో పాటుగా మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్, విటమిన్ కె, విటమిన్ ఏ, ఫైబర్, ఫాస్ఫరస్ ఇలా అనేక ముఖ్యమైన విటమిన్స్ ఖనిజాలు పాలకూరలో ఉంటాయి. క్రమం తప్పకుండా పాలకూరని తీసుకోవడం వలన జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. 100 గ్రాములు పాలకూరలో 23 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఫైబర్ ఇందులో ఎక్కువ ఉంటుంది పాలకూరని తీసుకుంటే చాలాసేపు కడుపు నిండుగా ఉంటుంది. ఆకలి త్వరగా వెయ్యదు. చాలామంది ఆకుకూరలు కూరగాయన్ని ఎక్కువగా ఇష్టపడరు.

Advertisement

కానీ నిజానికి వీటిలో పోషక పదార్థాలు బాగా ఎక్కువ ఉంటాయి రెగ్యులర్ గా ఆకుకూరని తీసుకోవడం చాలా ముఖ్యం. పాలకూరని కనుక ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆహారం తినాలని కోరిక కలగదు షుగర్ ఉన్నవాళ్లు శీతాకాలంలో పాలకులను తీసుకుంటే మంచిది. శీతాకాలంలో పాలకూరని తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి కాబట్టి తప్పకుండా షుగర్ పేషెంట్లు తీసుకోవడం మంచిది అలానే శీతాకాలంలో ఇంకా ఆకుకూరలు కూడా దొరుకుతూ ఉంటాయి. పోషక పదార్థాలు కలిగిన ఆకుకూరలు కూరగాయల్ని రెగ్యులర్గా డైట్లో చేర్చుకోవడం మంచిది. దాని వలన అనేక రకాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు ఆరోగ్యాన్ని మరింత పెంపొందించుకోవచ్చు.

ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading