కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే.. స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని తెలియచెప్పే అనేక లక్షణాలను శరీరం చూపిస్తుంది. మీకు లేవగానే ఉదయం సమయంలో ఛాతీలో అసౌకర్యంగా అనిపిస్తే, ఛాతీలో అసాధారణ నొప్పి కనిపిస్తే అది గుండెపోటుకు సంకేతంగా భావించవచ్చు. చలికాలంలో జలుబు చేసే అవకాశం ఎక్కువ. రోగ నిరోధక శక్తీ తక్కువగా ఉంటె.. తుమ్ములు, దగ్గులు ఎక్కువగా వస్తాయి. ఈ కాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే.
Advertisement
ఉదయం సమయంలో మీరు లేచేటప్పుడు ఛాతీలో నొప్పిని అనుభవిస్తుంటే.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచిది. గుండెల్లో నొప్పి, తేలికపాటి అసౌకర్యాన్ని కూడా అశ్రద్ధ చేయకండి. ఇవి గుండెపోటుకు దారితీసే అవకాశం ఉంది. శీతాకాలంలో కాలుష్యం స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆస్తమారోగుల అవస్థ వర్ణనాతీతం. మీకు ఆస్తమా లేకున్నా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే వైద్యుడిని కలవండి. రాత్రి కనీసం ఆరు నుంచి ఏడు గంటల పాటు నిద్రపోయినా.. ఉదయం లేవలేకపోతుంటే.. మీ శరీరం వీక్ గా అనిపిస్తూ ఉంటె.. అది కూడా గుండెజబ్బుకి సంకేతమే.
Advertisement
ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించడం, వాంతులు అవడం జరుగుతోందా? ఇవి మార్నింగ్ సిక్ నెస్ లక్షణాలు కాదు. రక్తప్రసరణలో ఇబ్బంది ఎదురైతే కూడా ఇలాంటివి జరుగుతాయి. మెడలో నొప్పి, ముఖ్యంగా శరీరం ఎడమవైపు ఎక్కువగా నొప్పి ఉంటె.. వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. శీతాకాలంలో రక్తనాళాలు కుచించుకుపోతే ఈ నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. మీ గుండె చప్పుడు మీకు సక్రమంగా అనిపించకపోయినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రతి చిన్న విషయాన్నీ ముందుగా గుర్తించి జాగ్రత్త తీసుకుంటే.. గుండెపోటు బారిన పడకుండా ఉంటారు.
మరిన్ని తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!