Home » శబరిమలలో మాత్రమే కాదు.. ఈ దేవాలయాల్లో కూడా మహిళలకు అనుమతి లేదు.. అవెక్కడంటే?

శబరిమలలో మాత్రమే కాదు.. ఈ దేవాలయాల్లో కూడా మహిళలకు అనుమతి లేదు.. అవెక్కడంటే?

by Srilakshmi Bharathi
Ad

స్త్రీలలో రుతుక్రమం అనేది సహజంగా జరిగే ప్రక్రియే. అయితే ఈ సమయంలో పూజా పునస్కారాలలో పాల్గొనకూడదు అన్నది హిందూ ఆచారం. ఆ సమయంలో గుడులు గోపురాలకు వెళ్ళడానికి కూడా స్త్రీలు ఇష్టపడరు. అయితే..ఈ కారణంతోనే కొన్ని దేవాలయాల్లో అసలు స్త్రీలకు ప్రవేశాన్ని నిషిద్ధం చేశారు. ముఖ్యంగా నెలసరి వచ్చే వయసులో స్త్రీలకు ఆలయంలో దర్శనం ఇవ్వరు. అయితే.. ఈ నియమం చాలా మంది అయ్యప్ప దేవాలయంలో మాత్రమే ఉందని అనుకుంటారు. కానీ, ఇంకా కొన్ని దేవాలయాల్లో కూడా ఈ నియమం ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

శబరిమల:

Advertisement


శబరిమలలో ఉన్న, లార్డ్ అయ్యప్ప ఆలయంలో 10-50 సంవత్సరాల వయస్సు గల మహిళలను ప్రవేశించడానికి అనుమతించరు. ఇందుకు వారు చెప్పే కారణం ఏమిటంటే, ఈ నిర్దిష్ట వయస్సు గల స్త్రీలు మరియు బాలికలకు ఎక్కువగా ఋతుస్రావం అయ్యే అవకాశం ఉంది.

శ్రీ పద్మనాభస్వామి ఆలయం, కేరళ
కేరళలోని శ్రీపద్మనాభస్వామి ఆలయంలో ఆలయ ఖజానాలోకి మహిళలు ప్రవేశించకూడదు. మహిళా భక్తులు దేవతను పూజించవచ్చు, కానీ వారు ఆలయ గదుల్లోకి వెళ్లడానికి అనుమతించరు. మహిళా అధికారులు కూడా నిధి వాల్ట్‌లలోకి అనుమతించబడరు.

Advertisement

లార్డ్ కార్తికేయ ఆలయం, పుష్కర్
పుష్కర్ లోని కార్తికేయ ఆలయాన్ని సందర్శించడానికి ధైర్యం చేసిన స్త్రీలు శాపానికి గురవుతారని చెబుతారు. అందుకే ఇప్పటి వరకు ఈ నిషేధం అమలులో ఉంది.

మావాలి దేవి ఆలయం, ఛత్తీస్‌గఢ్


ఛత్తీస్‌గఢ్ లోని దేవాలయాల్లో.. ఈ దేవాలయానికి చాలా విశిష్టత ఉంది. ఈ ఆలయంలో లోపలి గదుల్లోకి వెళ్ళడానికి స్త్రీలకు అనుమతి లేదు. ఆలయం బయట నుంచి మహిళలు దర్శించుకోవచ్చు. కానీ, లోపలకు వెళ్ళడానికి మాత్రం పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

శని శింగణాపూర్ ఆలయం, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయంలో కూడా మహిళలను లోపలకి అనుమతించరు. ఇక్కడ కూడా మహిళలు బయటనుంచి దర్శనం చేసుకోవచ్చు. కానీ, లోపలకి వెళ్ళడానికి వీలు లేదు. అయితే.. కొందరు మహిళలు దర్శనానికి అనుమతించాలంటూ ర్యాలీలు కూడా చేపట్టారు.

మరిన్ని  తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading