Home » అయోధ్య రామమందిరానికి ఎంపికైన మోహిత్ పాండే ఎవరు ? ఈయన గురించి మీకు తెలియని విషయాలు !

అయోధ్య రామమందిరానికి ఎంపికైన మోహిత్ పాండే ఎవరు ? ఈయన గురించి మీకు తెలియని విషయాలు !

by Sravya
Ad

రామ మందిరం నిర్మాణం దాదాపు పూర్తయిపోయింది. జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కోసం ఆహ్వాన పత్రికల్ని కూడా పంపుతున్నారు. ప్రధాన నరేంద్ర మోడీ కూడా ఇందులో ఉన్నారు అయితే ఇక్కడ అయోధ్య రామ మందిరంలో సేవ చేయడానికి పూజారులని నియమించే ప్రక్రియ కూడా పూర్తయింది. ఇందులో భాగంగా మోహిత్ పాండే అయోధ్య పూజారిగా ఎంపికయ్యారు. ఆయనకి ఆరు నెలల శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు. పూజారి ప్రకటనని అనుసరించి హిందూ వ్యతిరేక మతోన్మాదులు మోహిత్ పాండే ని లక్ష్యంగా చేసుకొని ఆయనపై ఘోరంగా ప్రచారాన్ని కూడా చేశారు. కానీ అదంతా వట్టి నకిలీ వార్త అని తెలిసిపోయింది.

Advertisement

Advertisement

ఇక ఇంతకీ మోహిత్ పాండే ఎవరు అనే విషయాన్ని చూద్దాం. 50 మంది పూజారుల్లో ఆయన ఎంపికయ్యారు. మీడియా రిపోర్ట్ ల ప్రకారం చూస్తే ఆయన ఎంఏ ఆచార్య చదివినట్టు తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం నడిపిస్తున్న ఎంఏ ఆచార్య ప్రోగ్రాం ని ఆయన చదివారు. శ్రీ వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీ ని తిరుమల దేవస్థానం నడుపుతోంది. లక్నో ఉత్తర ప్రదేశ్ కి చెందిన వ్యక్తి మోహిత్ పాండే.

3000 మంది రామ మందిరం పూజారి పోస్ట్ కి అప్లై చేశారు. ఫైనల్ గా ఇందులో మోహిత్ పాండే సెలెక్ట్ అయ్యారు. సామవేద చదువుకున్న తర్వాత వెంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో మోహిత్ పాండే చదువుకున్నారు. ఆచార్య డిగ్రీ వచ్చిన తర్వాత పిహెచ్డి కోసం ప్రిపేర్ అవుతున్నారు. దూదేశ్వర్ వేద విద్యాపీఠం లో ఏడేళ్లు పాటు ఆయన చదువుకున్నారు గత 23 ఏళ్ల నుంచి ఇక్కడ చాలామంది విద్యార్థులు వేదాన్ని చదువుకుంటున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading