ప్రభాస్ హీరోగా, సలార్ సినిమా తెర మీదకి రాబోతుంది. కేజిఎఫ్ ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో సలార్ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకున్నారు. డిసెంబర్ 22న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ టికెట్ రేట్లు ని పెంచుకునే విధంగా అనుమతి ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలని చిత్ర యూనిట్ చర్చలు జరుపుతోంది అనే విషయంపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisement
ఈ టికెట్ రేట్ల పెంపు వివరాలని చూసేద్దాం… సలార్ సినిమా భారీ బడ్జెట్ తో తెర మీదకు వస్తోంది. ఈ సినిమా టికెట్ రేట్లు పెంచాలని, ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలని చిత్ర యూనిట్ కోరినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్లలో 450 రూపాయలు. సింగిల్ స్క్రీన్ లో 250 ఉండేటట్టు అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారట. మల్టీప్లెక్స్ లో ఇంత రేటు పెడితే ఎవరు సినిమాకి వస్తారు..? దాని వలన చిన్న సినిమాలని చంపేయడమే జరుగుతుందని తన వాదనని వినిపిస్తున్నారు నిర్మాతలు.
Advertisement
అలానే బిఆర్ఎస్ ప్రభుత్వంలో జారీ చేసిన 120 జీవో ని రద్దు చేయాలని చిన్న నిర్మాతలు రేవంత్ రెడ్డి ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. 120 జీవో ప్రకారం, పరిస్థితుల్ని బట్టి రాష్ట్రమంతటా టికెట్ రేట్లను పెంచుకునేందుకు, ప్రభుత్వం వెసులుబాటుని కలిగిస్తూ జీవో జారీ చేయడం జరిగింది. పేదవాడు తక్కువ రేట్ కి సినిమా చేస్తే చిన్న సినిమాకు మేలు జరుగుతుంది. సలార్ సినిమా టికెట్ మల్టీప్లెక్స్ లో 200 దాటకూడదు. సింగిల్ స్క్రీన్ 100 రూపాయలకి మించకూడదు. 120 జీవో ని రద్దు చేయండి అని నట్టి కుమార్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!