Home » స‌మంత విజ‌య్ దేవ‌రకొండ‌తో “ఊ” అంటుందా..?

స‌మంత విజ‌య్ దేవ‌రకొండ‌తో “ఊ” అంటుందా..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు ఐట‌మ్స్ సాంగ్స్ చేయాలంటే సిల్మ్ స్మిత, జ్యోతిల‌క్షి, ముమైత్ ఖాన్ లాంటి గ్లామ‌ర్ డాల్స్ ప్ర‌త్యేకంగా ఉండేవాళ్లు. కానీ చాలా కాలం క్రిత‌మే ట్రెండ్ మారిపోయింది. గ‌త కొంత కాలంగా హీరోయిన్లే ఐట‌మ్ పాట‌ల‌కు స్టెప్పులు వేస్తున్నారు. ఇక రీసెంట్ సెన్సేష‌న‌ల్ స‌మంత‌..ఊ అంటావా..?ఊఊ అంటావా అనే పాట‌తో స‌మంత కుర్రాళ్ల మ‌తిపోగొట్టింది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో కలిసి స‌మంత ఈ పాట‌కు స్టెప్పులు వేసింది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో అన్ని భాష‌ల్లో విడుద‌లైంది.

Samantha item song for pushpa

Advertisement

దాంతో ఊ అంటావా పాట స‌మంత డ్యాన్స్ రెండూ ప్రేక్షకుల‌ను మెప్పించాయి. అయితే ఇప్పుడు స‌మంత వ‌ద్ద‌కు మ‌రో ఐటెం సాంగ్ వచ్చిన‌ట్టు తెలుస్తోంది. రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాత్ ద‌ర్శ‌క‌త్వంలో లైగ‌ర్ అనే సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెర‌కెక్కుతోంది.

Advertisement

ఈ చిత్రంలో అన‌న్య పాండే హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా సినిమాను క‌ర‌న్ జోహార్ పూరీజ‌గ‌న్నాత్ క‌లిసి భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా విడుద‌ల‌కు ముందే భారీ క్రేజ్ వ‌చ్చింది. అయితే ఆ క్రేజ్ కు త‌గ్గ‌ట్టుగా ఈ సినిమాలో స‌మంత‌తో ఐటెం సాంగ్ చేయించాల‌ని చిత్ర‌యూనిట్ భావిస్తున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. అంతే కాకుండా ఐటెం సాంగ్ కోసం ఇప్ప‌టికే స‌మంత‌ను సంప్ర‌దించిన‌ట్టు కూడా తెలుస్తోంది.

సమంత ఐటెం సాంగ్ చేస్తే అది కూడా సినిమాకు ప్ల‌స్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. అంతే కాకుండా స‌మంతతో త‌నకు ఉన్న చ‌నువుతో రౌడీ హీరో విజ‌య్ దేవ‌రకొండ కూడా స‌మంత‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. మ‌రి స‌మంత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఊ అంటుందా లేదా చూడాలి.

Visitors Are Also Reading