Home » మన్సూర్‌ను తిట్టిన మద్రాస్ హై కోర్టు…!

మన్సూర్‌ను తిట్టిన మద్రాస్ హై కోర్టు…!

by Sravya
Ad

మన్సూర్ అలీ ఖాన్ అందరికీ సుపరిచితమే. కోలీవుడ్ లో టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ అయిపోతున్నాడు. తాజాగా త్రిశతో పాటుగా చిరంజీవి కుష్బూలపై కూడా పరువు నష్టం కేసు దాఖలు చేశాడు. కోర్టు తిరిగి ఆయనకే తిట్లు పెట్టింది. అసలు కేసు మీ మీద పెట్టాలి కదా అని చెప్పింది. దీంతో ఈ వివాదానికి ముగింపు అయితే వచ్చేసింది. అసలు ఇంతకీ ఏం జరిగిందనేది చూస్తే… గడిచిన నెల రోజులు గా లియో సినిమా 600 కోట్లకు పైబడి కలెక్షన్లతో సూపర్ హిట్ అయింది. ఈ గొడవకి కారణం ఈ సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాలో విలన్స్ లో ఒకరిగా మన్సూర్ నటించారు.

Advertisement

హీరోయిన్ గా నటించిన త్రిష పైన చేసిన కామెంట్స్ సినీ ఇండస్ట్రీని కలకలం రేపింది. ఇటువంటి వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు సంతోషిస్తున్నాను, భవిష్యత్తులో ఎప్పుడూ అటువంటి తప్పు చేయనని త్రిష అన్నారు. త్రిషపై మన్సూర్ చేసిన కామెంట్స్ చూసి, ఇండస్ట్రీ అంతా కూడా షాక్ అయిపోయింది. చిరంజీవి త్రిషకి సపోర్ట్ గా నిలిచారు జాతీయ మహిళా కమిషనర్ సభ్యురాలు ఒకప్పటి హీరోయిన్ కుష్బూ కూడా మండిపడ్డారు.

Advertisement

చివరికి ఇప్పుడు మన్సూర్ త్రిష కి సారీ చెప్పారు రెండు రోజులుగా సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు త్రిష తో పాటుగా ఆమెకి మద్దతు ఇచ్చిన వాళ్లపై కేసు పెట్టాడు. తనని అనరాని మాటలు అన్నారని హైకోర్టుని ఆశ్రయించాడు. చిరంజీవి, కుష్బూ, త్రిష వలన పరువు భంగం కలిగిందని ఎంతో బాధపడ్డానని దాదాపు కోటి డిమాండ్ చేస్తూ వారి ముగ్గురిపై పరువు నష్టం దావా వేశారు. తిరిగి కోర్టు మాన్సూర్ని తిట్టింది. త్రిష మీద ముందు కేసు పెట్టాలని కోర్టు చెప్పింది అలీ ఖాన్ వ్యాఖ్యలకి సంబంధించిన అన్ కట్ వీడియోని సమర్పించాలని హైకోర్టు న్యాయవాదికి స్పష్టం చేశారు. మాన్సూర్ పై త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ లని తొలగించాలి ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. తదుపరి విచారణని డిసెంబర్ 22 కి వాయిదా వేశారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading