Home » Jabardasth Pavitra: తనకు కాబోయే భర్తని పరిచయం చేసిన పవిత్ర అతనెవరంటే ?

Jabardasth Pavitra: తనకు కాబోయే భర్తని పరిచయం చేసిన పవిత్ర అతనెవరంటే ?

by Sravya
Ad

జబర్దస్త్ షో ద్వారా చాలామంది ఆర్టిస్టులు పాపులర్ అయిపోయారు. ఎంతోమంది చిన్న ఆర్టిస్టులు బాగా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం బిజీగా మారిపోయారు. నిజానికి జబర్దస్త్ షో చాలామందికి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో పవిత్ర కూడా ఒకరు. జబర్దస్త్ షో ద్వారా ఈమె పాపులారిటీని బాగా తెచ్చుకున్నారు ఈమె జబర్దస్త్ షో తో పాటుగా శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా చేస్తోంది. తాజాగా పవిత్ర తనకి కాబోయే భర్తని పరిచయం చేస్తూ ఒక రొమాంటిక్ డాన్స్ కూడా చేసింది. సోషల్ మీడియాలో షేర్ చేయడం కూడా జరిగింది.

Advertisement

Advertisement

కొద్ది రోజుల క్రితం తన ప్రేమ విషయాన్ని పెళ్లి విషయాన్ని పవిత్ర సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సంతోష్ అనే వ్యక్తిని పవిత్ర పెళ్లి చేసుకోబోతోంది. వీళ్ళు నిశ్చితార్థం కూడా జరుపుకున్నారు. పెళ్లి మాత్రం ఎప్పుడో చెప్పలేదు. ఈ జంట ప్రస్తుతం లవ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ వీడియో వైరల్ అవుతోంది. ఒక రొమాంటిక్ పాటకి వీళ్ళిద్దరూ కూడా డాన్స్ చేయడం జరిగింది.

కొన్ని సిచువేషన్స్ లో మనకి డాన్స్ వేయడం రాకపోతే ఎలా మేనేజ్ చేయాలి అంటూ వీడియోకి ఆమె జత చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. పవిత్ర కి సంతోష్ ముందుగా తన ప్రేమని ప్రపోజ్ చేశారు. కొంతకాలం తర్వాత పవిత్ర కూడా ఓకే చెప్పింది. ఒక ఏడాది ప్రేమలో ఉన్నాక నిశ్చితార్థం చేసుకున్నారు ఇప్పుడు కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారట.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading