భార్యా భర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. రెండు వేరు వేరు కుటుంబాలు, రెండు వేరు వేరు నేపధ్యాల్లో పెరిగిన వ్యక్తులు జీవితాంతం కలిసుండడం అనేది ఆషామాషీ విషయం ఏమీ కాదు. అయితే.. వీరిద్దరూ సర్దుకుపోవడానికి చాలా సమయమే పడుతుంది. ఈ క్రమంలో కొన్ని గొడవలు అవుతుండడం కూడా సహజమే. నిజానికి వివాహ బంధం తరువాత ఇద్దరికీ కొత్త బాధ్యతలు పెరుగుతాయి. వీటి వల్లే కొన్ని సార్లు మీ అంచనాలకు తగ్గట్లు మీ భాగస్వామి ఉండలేకపోవచ్చు.
Advertisement
అందుకే మన జీవిత భాగస్వామి నుంచి కొన్ని విషయాలను ఆశించకూడదు అని చెబుతుంటారు. జెండర్ ని బట్టి కూడా కొన్ని బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. భార్య అంటే ఇంటి పనులను చక్కపెట్టుకోవాలి, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి.. అవసరమైతే త్యాగాలు చెయ్యాలి అంటూ చాలా మందికి భార్య అనగానే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాగే ఆడవారికి కూడా తమ భర్త అలా ఉండాలి, ఇలా చేయాలి అంటూ కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అయితే.. బాధ్యతల కారణంగా ఈ అంచనాలను చేరుకోవడం అందరికి సాధ్యం కాకపోవచ్చు. ఈ అంచనాల వలన భార్యా భర్తల మధ్య గొడవలు రాకూడదు.
Advertisement
వదిలేసి వెళ్ళిపోతారేమో అనే అభద్రతా భావం ఆడవారిలోనే కాదు.. మగవారిలో కూడా ఉంటుంది. దీని వల్లే మనసులో సందేహాలు, అభద్రతా భావాలూ కలుగుతుంటాయి. కొన్నిసార్లు గొడవలకు ఇదే కారణం అవ్వొచ్చు కూడా. వైవాహిక జీవితం మొదలయ్యాక గొడవలు, సర్దుకుపోవడాలు సహజమే. అంతమాత్రాన విడిపోవాలని ఎవరూ అనుకోరు. అందుకే నన్ను వదిలేస్తావా అని పదే పదే అడిగి విసుగు తెప్పించకండి. భార్యాభర్తలు అన్నాక ఒకరినొకరు సంతోషపెట్టుకోవాలి. సంతోషపెట్టడం అనేది ఒకరి బాధ్యతే కాదు. మీ భాగస్వామి మూడ్ తో సంబంధం లేకుండా మిమ్మల్ని సంతోష పెడుతూనే ఉండాలని ఆశించడం చాలా పెద్ద తప్పు. అలాగే మీరు చెప్పే ప్రతి దాన్ని మీ భాగస్వామి ఒప్పుకోవాలని ఆశించడం కూడా తప్పే. అయితే మీరు చెప్పే దాన్ని చేయాలనే ఉద్దేశంతో వారిపై ఒత్తిడి తేవడం వలన కూడా బంధం బీటలు వారుతుంది.