నటి ఆర్తి అగర్వాల్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోలందరికి ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంది. కానీ ఆమె అనుహ్యంగా కన్నుమూశారు. డైరెక్టర్ నటుడు అమ్మ రాజశేఖర్ ఆర్తి అగర్వాల్ చివరి రోజుల్లో తనతో మాట్లాడిన మాటల గురించి మీడియాతో పంచుకోవడం జరిగింది. ఆర్తి అగర్వాల్ చాలామంది టాప్ హీరోల పక్కన నటించింది.
Advertisement
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున. వెంకటేష్ తో పాటుగా ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి హీరోలతో కూడా ఈమె నటించింది. వ్యక్తిగత కారణాలతో డౌన్ ఫాల్ ప్రారంభమై సినిమాలకి దూరమైపోయింది 2007లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది. 2009లో విడాకులు అయిపోయాయి 2017 లో ఈమె శస్త్ర చికిత్స చేయించుకుంది. 31 సంవత్సరాల వయసులో ఆర్తి అగర్వాల్ కన్నుమూశారు. 2015లో అమ్మ రాజశేఖర్ డైరెక్ట్ చేసిన రణం 2 సినిమాలో ఆర్తి అగర్వాల్ నటించారు.
Advertisement
నటుడు శ్రీహరికి అనారోగ్య కారణాలతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఆ టైంలో ఆరు నెలల గ్యాప్ తర్వాత షూటింగ్ కి వచ్చిన ఆర్తి అగర్వాల్ ని చూసి అమ్మ రాజశేఖర్ షాక్ అయ్యారు. ఆమె బాగా బరువు పెరిగిపోయారు. ఆమె కాస్ట్యూమ్ కూడా సెట్ కాలేదని బాగా ఏడ్చారట. బరువు తగ్గడం కోసం ఆమె సర్జరీ చేయించుకున్నారు ప్రాణాలు మీదకి తెచ్చుకున్నారు చిన్నవయసులోనే ఆమె కన్నుమూశారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!