Home » MS Narayana death anniversary : న‌వ్వుల రారాజు ఎమ్మెస్ 7వ వ‌ర్థంతి నేడు..!

MS Narayana death anniversary : న‌వ్వుల రారాజు ఎమ్మెస్ 7వ వ‌ర్థంతి నేడు..!

by AJAY
Ad

టాలీవుడ్ లెజండ‌రీ న‌టుల్లో ఎమ్మెస్ నారాయ‌ణ ఒక‌రు. బ్ర‌హ్మానందం లాంటి క‌మెడిన్ నే మెప్పించిన ఘ‌న‌త ఎమ్మెస్ కు ద‌క్కింది. 1995 లో ఎమ్మెస్ నారాయ‌ణ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. మా నాన్న‌కు పెళ్లి సినిమాతో క‌మెడియ‌న్ గా మంచి హిట్ అందుకున్నారు. ఆ త‌ర‌వాత వెన‌క్కి చూసుకోకుండా 700 సినిమాల్లో న‌టించి అల‌రించారు. అన‌తికాలంలోనే కామెడీ లెజండ్ గా ఎమ్మెస్ పేరు తెచ్చుకున్నారు. అలాంటి కామెడీ స్టార్ చ‌నిపోయి నేటికి ఏడేళ్లు అవుతోంది.

ms narayana

Advertisement

2015 లో జ‌న‌వ‌రి 23న ఎమ్మెస్ నారాయ‌ణ క‌న్నుమూశారు. సంక్రాంతి పండ‌క్కి ఊరెళ్లిన ఎమ్మెస్ అనారోగ్యం కార‌ణంగా అక్క‌డే మృతి చెందారు. ఎమ్మెస్ మ‌ర‌ణం టాలీవుడ్ కు తీర‌ని లోటు అనే చెప్పాలి. సీనియ‌ర్ హీరోల‌తో పాటూ కుర్ర హీరోలతోనూ సినిమాలు చేసిన ఆయ‌న కామెడీని పండించ‌డంలో లెజెండ్ అనిపించుకున్నారు. నిజ‌జీవితంలో లెక్చర‌ర్ అయిన ఆయ‌న సినిమాల్లోనూ లెక్చ‌ర‌ర్ పాత్ర‌లు చేసి మెప్పించారు.

Advertisement

ms narayana

పిల్ల జ‌మిందార్ లో తెలుగు చ‌నిపోతే అదే జ‌రిగితే తెలుగు కంటే మందు నేనే చ‌నిపోతా అని ఏడ్పించారు. దూకుడు సినిమాలో ప‌లువురు హీరోల స్పూఫ్ చేసి న‌ట‌న‌లో రారాజు అనిపించుకున్నారు. ఈ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. సినిమా విజ‌యం లో భాగం అయ్యింది. దుబాయ్ సినిమాలో ఫైవ్ స్టార్ స‌ల్మాన్ రాజ్ పాత్ర‌లో న‌టించి న‌వ్వులు పూయించారు. ప‌టాస్ సినిమాలో ఎమ్మెస్ ముస‌లి హీరోగా నటించి ఆక‌ట్టుకున్నారు.

ms narayana

ఈ సినిమా ఎమ్మెస్ చ‌నిపోయిన రోజునే విడుద‌ల‌య్యింది. అంతే కాకుండా తాగు బోతు పాత్ర‌ల్లో ఎమ్మెస్ ను మించిన న‌టుడు లేడ‌ని ప్రూవ్ చేసుకున్నారు. హ‌నుమాన్ జంక్ష‌న్ సినిమాలో తాగు బోతు పాత్ర‌లో న‌టించి న‌వ్వులు పూయించాడు. అలా ఎన్నో సినిమాల‌తో ఎమ్మెస్ ప్రేక్ష‌కుల మ‌దిలో బ్ర‌తికే ఉంటారు.

Visitors Are Also Reading