ఈరోజుల్లో చాలామంది ఎక్కువగా మొబైల్ ఫోన్స్ ని వాడుతున్నారు ఫోన్ లకి అతుక్కుపోతున్నారు. ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని చాలామంది చూస్తున్న కుదరట్లేదు మీరు కూడా ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవడానికి చూస్తున్నారా..? అయితే ఇలా చేయాల్సిందే. ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలంటే మీరు ఈ చిన్న చిట్కాతో ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ముందు మీరు స్క్రీన్ టైమ్ ని హోమ్ పేజ్ లో ఉంచుకోవాలి.
Advertisement
ప్రతిరోజు ఎంత స్క్రీన్ టైమ్ ఉందో ప్రత్యేకంగా ఒక డైరీలో రాసుకోండి. క్రమంగా తగ్గించుకోవడానికి చూసుకోండి. మీరు ఏ యాప్స్ లో అయితే సమయాన్ని వృధా చేస్తున్నారో ఆ యాప్స్ ని తొలగించండి. కానీ రోజుకి ఒక యాప్ ని తొలగించడానికి ట్రై చేయండి. ఇలా నెమ్మదిగా మీరు ఫోన్ వాడకండి. తగ్గించుకోవచ్చు.
Advertisement
అలానే నోటిఫికేషన్స్ శబ్దాన్ని ఆపేస్తే కూడా మంచిది. చాలా మంది నోటిఫికేషన్ రాగానే ఫోన్ తీస్తున్నారు. తర్వాత చాలాసేపు అయిపోయినా ఫోన్ ని పక్కన పెట్టట్లేదు. కాబట్టి నోటిఫికేషన్ తీసేయండి. అవసరమైన వాటికి మాత్రమే నోటిఫికేషన్ పెట్టుకోండి. ఫోన్ ని బ్లాక్ అండ్ వైట్ లో పెట్టుకుంటే కూడా ఫోన్ వాడకాన్ని తగ్గించడానికి అవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువసేపు గడిపి సమయాన్ని వృధా చేయకండి ఆ సమయాన్ని మరొక ముఖ్యమైన వాటికోసం ఉపయోగించుకోండి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!