మనం నిద్రపోయినప్పుడు మనకి చాలా కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనకి రాత్రి వచ్చిన కలలు కూడా గుర్తుండవు. కొన్ని కొన్ని సార్లు భయంకరమైన పీడకలలు లేదంటే వింతైన కలలు ఏమైనా వచ్చినట్లయితే వాటిని మనం ఉదయాన్నే ఎవరికైనా చెప్పుకొని బాధపడడం, ఆశ్చర్యపడడం చేస్తూ ఉంటాము. రాత్రి నిద్ర పోయిన తర్వాత ఒక్కొక్కసారి వాన పడుతున్నట్లు కూడా మనకి కల వస్తుంది. వాన పడినట్లు కల వస్తే దానికి కారణం ఏంటి ఎందుకు ఈ కల వస్తుంది అనే దాని వెనుక కారణాన్ని చూద్దాం.
Advertisement
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో తెల్ల ఏనుగు కనపడితే అది రాబోయే మంచి కాలానికి సంకేతం ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అని, అదృష్టం కూడా కలుగుతుంది అని అది చెప్తుంది. అదే కలలో దేవాలయాలు కనపడినట్లైతే అది శుభప్రదంగా భావించాలి. కుబేరుడుతో మీరు ఆశీర్వదించబడతారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.
Advertisement
కలలో వాన కనపడితే అది శుభం. వాన కనపడితే ఆర్థిక సమస్యలు త్వరలో ముగిసిపోతాయని అది సూచిస్తుంది. కొత్త ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయట. కలలో కనుక చెట్టు ఎక్కడం కానీ ఎత్తైన ప్రదేశానికి వెళ్లడం కానీ కనపడినట్లయితే అది కూడా ఎంతో మంచిని తీసుకువస్తుంది. కలలో చీమలు కనపడితే కూడా శుభప్రదంగా పరిగణించాలి. ఇలా మనకి వచ్చే కలను బట్టి మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అనేది స్వప్న శాస్త్రంలో చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!