తెలంగాణ ఎన్నికల ఫలితాలలో బర్రెలక్కకి ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదు. కొల్లాపూర్ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా శిరీష పోటీ చేసింది. 15000 ఓట్లు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అయితే బర్రెలక్కకి మాత్రం ఎక్కువ ఓట్లు పడలేదు. ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. శిరీష తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని పంచుకోవడం జరిగింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే శిరీషకి చాలా ఇష్టం అని ఆమె చెప్పుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నా బావ అని నా లవర్ కూడా ఆయనని శిరీష అన్నారు.
Advertisement
Advertisement
నా క్రష్ కూడా ఆయనే అని శిరీష చెప్పారు పోలీస్ డ్రెస్ లో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అని శిరీష చెప్పుకొచ్చారు. మహేష్ బాబు వలన నేను పోలీస్ అవ్వాలని అనుకున్నాను అని, ఆ ఆలోచన వచ్చిందని శిరీష చెప్పారు. మహేష్ బాబు నటించిన అన్ని సినిమాలు చూశానని శిరీష అన్నారు.
సాయికుమార్ డైలాగ్స్ చాలా ఇష్టమని సాయికుమార్ సినిమాలకు సైతం ఇష్టపడ్డానని శిరీష చెప్పారు. కుటుంబ సమస్యల కారణంగా ప్రేమ జోలికి వెళ్లలేదని, శిరీష అన్నారు. ప్రస్తుతం శిరీష చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి. శిరీషకి అనుకూల ఫలితాలు రాలేదని, శిరీష అభిమానులు బాధపడుతున్నారు. ఎన్నికల్లో ఆమె గెలుస్తుందని చాలామంది అనుకున్నారు కానీ ఓట్లు మాత్రం ఆమెకి పడలేదు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!