వివాదాస్పద నటి శ్రీరెడ్డి తరచూ ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తోంది. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ సామాజిక రాజకీయ సినిమా అంశాలపై శ్రీరెడ్డి స్పందిస్తూ ఉంటుంది. అదే విధంగా ప్రస్తుతం ఓ యూట్యూబ్ ఛానల్ లో ప్రారంభించి వంటల వీడియోలు మరియు వ్లాగ్స్ తీస్తూ తన ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే శ్రీరెడ్డి పెద్దగా సినిమాలు చేయకపోయినా క్యాస్టింగ్ కౌచ్ అంశంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఏకంగా ఫిలిం ఛాంబర్ ముందు పై దుస్తులు తీసేసి కూర్చుంది.
Advertisement
అంతేకాకుండా కొంత మంది నటులపై సంచలన ఆరోపణలు చేసింది. ఇక ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ రెచ్చిపోయే శ్రీరెడ్డి తాజాగా క్షమాపణలు చెబుతూ ఓ వీడియో పెట్టడం ఆసక్తికరంగా మారింది. శ్రీ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవికి క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసింది. గతంలో తాను అంజలీదేవిని దోషించా అని అనవసరంగా తప్పు అని తెలిపింది.
Advertisement
దానికి ఇప్పుడు క్షమాపణ చెబుతున్నానని పెద్ద మనసు చేసుకొని అంజనాదేవి క్షమించాలని కోరింది. పెద్దమ్మ తల్లి కూడా తన బిడ్డలను క్షమిస్తుందని… అంజనాదేవి అలాగే అనుకుని క్షమించాలని కోరింది. ఓ పెద్దమనిషి తనతో మాట్లాడించాడని తాను కావాలని తిట్టలేదు అని చెప్పింది.
అంజనా దేవి పై చేసిన వ్యాఖ్యలతో తాను కూడా శిక్షను అనుభవించానని తెలిపింది. ఆ సమయంలో తన పై చాలా ట్రోల్స్ వచ్చాయని తన వాళ్ళు కూడా ఆ వ్యాఖ్యలను తప్పుపట్టారు అని తెలిపింది. ఎంతో కాలంగా ఈ విషయం గురించి బాధ పడ్డాను అని చెప్పింది. అయితే శ్రీరెడ్డి తనతో అలా ఎవరు చెప్పించారు అన్నది మాత్రం బయటకు చెప్పలేదు. దాంతో నెటిజన్లు నీతో ఆ మాటలు పలికించిది ఎవరని….చెప్పాలని కోరుతున్నారు.
Also Read: అఖండలో నటించిన చిన్నారి ఎవరో తెలుసా..! సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందంటే…!