నటి సౌందర్య గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సౌందర్య సౌత్ ఇండియాలో ఒకప్పటి పెద్ద స్టార్ హీరోయిన్. సహజ నటనతో ఎంతోమంది అభిమానుల్ని పొందింది. చిత్ర పరిశ్రమంలోకి వచ్చిన కొన్నేళ్లలోనే స్టార్ హీరోస్ అందరితో నటించి మంచి క్రేజ్ ని తెచ్చుకుంది. కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది సౌందర్య. దాదాపుగా వంద సినిమాలు కి పైగా సౌందర్య నటించి మంచి పేరు తెచ్చుకుంది. దురదృష్టం కొద్ది ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయింది. ఆమె డెడికేషన్ ఓ రేంజ్ లో ఉండేది ఎంతో సహనంతో ఓర్పుతో ఉండేదట సౌందర్య.
Advertisement
Advertisement
సౌందర్య అప్పట్లో కన్నడలో ఒక స్టార్ హీరో మూవీ చేసింది ఆ స్టార్ హీరో కి సంబంధించిన డేట్స్ తక్కువ ఉండడం వలన పని ఎక్కువ గంటలు చేయాల్సి వచ్చింది. డైరెక్టర్ ఒక్కో షాట్ కి పది టేకులు తక్కువ కాకుండా తీస్తున్నాడట ఉదయం ఏడు గంటలకి షూటింగ్ స్పాట్ కి వస్తే మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు షూటింగ్ జరిగేది.
ఆమెకి పగలు నిద్రపోయే అలవాటు లేకపోయేసరికి సౌందర్య ఎంత నిద్రపోవాలని చూసినా నిద్ర పట్టేది కాదు. అప్పుడు సౌందర్యకి నిద్రలేమి సమస్య వచ్చింది ఆ సమయంలో ఆమె నిద్రపోవడం కోసం తక్కువ మోతాదులో నిద్రమాత్రలు వేసుకుని నిద్రపోయేదిట మళ్లీ వెంటనే నిద్ర నుంచి షూటింగ్ కి వెళ్ళలేదట షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకు సౌందర్య టార్చర్ చూసిందట.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!