సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా నిన్న రిలీజ్ అయింది. రణ్ బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ దక్కింది. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వచ్చాయి. యానిమల్ మూవీ ఫుల్ రన్ కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని కూడా ముందు నుండి అంతా అన్నారు. ఇక మరి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. మరి ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడు అనే విషయాన్ని చూద్దాం.
ప్రముఖ ఓటీటీ లో ఒకటైన నెట్ ఫిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులని కొనుగోలు చేసింది భారీ మొత్తంలో నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులని దక్కించుకుంది. 2024 సంవత్సరం జనవరి నెల 26వ తేదీన ఈ సినిమా కాబోతున్నట్లు తెలుస్తోంది. హిందీ సినిమాల రూల్స్ ప్రకారం ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ లో సినిమా స్ట్రీమింగ్ అవ్వాలి. యానిమల్ సినిమా రిలీజ్ విషయంలో కూడా నిబంధనలని ఫాలో అవుతున్నారని సమాచారం.
Advertisement
Advertisement
యానిమల్ మూవీ సరికొత్త రికార్డులని క్రియేట్ చేయాలి అని భారీగా కలెక్షన్లు ని రాబట్టాలని అంతా కోరుకుంటున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని కూడా అంటున్నారు. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమా బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ లెవెల్ పెరగబోతోందని మళ్లీ మంచి సినిమాలను తెర మీదకి సందీప్ తీసుకు వస్తారని ప్రేక్షకులు అభిప్రాయం.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!