Home » క్షీణించిన విజయకాంత్ ఆరోగ్యం… పల్మనరీ సపోర్ట్ ఇవ్వాలన్న ఆసుపత్రి…!

క్షీణించిన విజయకాంత్ ఆరోగ్యం… పల్మనరీ సపోర్ట్ ఇవ్వాలన్న ఆసుపత్రి…!

by Sravya
Ad

ప్రముఖ సినీ నటుడు డిఎంకె పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ కాంత్ ఆరోగ్యం బాగోలేదు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. విజయ్ కాంత్ దగ్గు, జ్వరం, జలుబుతో నవంబర్ 18న చెన్నైలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేరారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. కొంతమంది వైద్యులతో కూడిన బృందం ఆయనకి ట్రీట్మెంట్ చేస్తోంది. విజయకాంత్ ఆరోగ్యం కుదుటపడిందని ఇంకో రెండు రోజులు ఇంటికి చేరుకుంటారని అభిమానులు అనుకున్నారు.

Advertisement

కానీ హాస్పిటల్ వర్గాలు ఆయన ఆరోగ్యం క్షీణించిందని హాస్పిటల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మరో 14 రోజులపాటు హాస్పిటల్ లోనే ఉండాలని స్పష్టం చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్యంలో క్షీణించిందని ఆయనకి కొంచెం పల్మనరీ చికిత్స అవసరం మరో 14 రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స తీసుకోవాలని హాస్పిటల్ చెప్పింది.

Advertisement

వారం రోజుల క్రితం హాస్పిటల్ విడుదల చేసిన హెల్త్ బులిటిన్లో విజయ్ కాంత్ వైద్యానికి స్పందిస్తున్నారని నిలకడగా ఉందని.. అన్ని అవయవాలు కూడా సరిగ్గా పనిచేస్తున్నాయని డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు మరో హెల్త్ బులిటిన్ విడుదల కావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు రాజకీయ నాయకులు విజయకాంత్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading