పుట్టిన వాడు గిట్టక తప్పదు అన్నది భగవద్గీతలో చెప్పబడ్డ సూక్తి. ఎంతటి వీరుడైనా ఏదో ఒక రోజు మరణానికి తల వంచక తప్పదు. మరణం గురించి చాలా మంది భయపడుతూనే ఉంటారు. కొందరు మాత్రం.. ఏదో ఒక రోజు మరణానికి ఎదురెళ్లక తప్పదు కదా అని మొండిధైర్యంతో బతికేస్తూ ఉంటారు. అయితే.. ఎప్పుడు వస్తుందో తెలియని మరణం గురించి ఆలోచిస్తూ ప్రతిరోజు బాధపడ్తు ఉండడం కంటే.. ఉన్నంత కాలం సంతోషంగా బతకడం నేర్చుకుని.. బతికి వెళ్ళిపోవాలి. అందుకు తగ్గట్లే మన మైండ్ ని ప్రిపేర్ చేసుకుని ఉండాలి.
Advertisement
అయితే.. గరుడ పురాణంలో మరణం గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. మరణం ఎదురయ్యే ముందు ఎలాంటి సంకేతాలు వస్తాయో ఈ పురాణంలో చెప్పబడ్డాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకోండి. ఎవరైనా ఒక వ్యక్తి మరణానికి చేరువలో ఉంటె.. అతను తన చుట్టూ తన పూర్వీకులు ఉన్నట్లు, చనిపోయిన వారు తన దగ్గరకు వస్తున్నట్లుగా ఫీల్ అవుతాడట. అలాగే మరణానికి ముందు వ్యక్తులకు తమ నీడ కనిపించదట. ఎవరికైతే తమ నీడ కనిపించడం మానేస్తుందో.. వారు మరణానికి చేరువైనట్లు అర్ధమట.
Advertisement
అలాగే మరణానికి చేరువైన వ్యక్తి తన ముక్కుని తాను చూడలేకపోతాడట. ఈ విషయం గరుడ పురాణంలో పేర్కొనబడింది. అలాగే.. మరణం సమీపించిన వ్యక్తికీ చంద్రుడు కూడా విచ్చిన్నం అవుతూ కనిపిస్తాడట. చంద్రుని చుట్టూ ఓ వృత్తాకారం ఉన్నట్లు కనిపిస్తుందట. మరణానికి చేరువైన వ్యక్తి గతంలో లాగ చంద్రుడిని చూడడం అనేది జరగదట. అలాగే మరణానికి చేరువైన వ్యక్తి నుంచి ఓ వింత వాసన వస్తుంటుంది. చేతిరేఖలు మారడం, మాయమవ్వడం, ముక్కు నోరు గట్టిగా మారిపోవడం, నాలుక వణుకుతూ ఉండడం జరుగుతాయట. కొంతమందికి యమదూతలు వచ్చినట్లు కనిపిస్తుందట. మరికొందరికి రహస్య తలుపులు తెరుచుకున్నట్లు కనిపిస్తుందట. ఇంకొందరికి తమ చుట్టూ మంటలు కనిపిస్తాయని గరుడపురాణం చెబుతోంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!