Home » Mohammed Shami : ఘోర రోడ్డు ప్రమాదం…రిస్క్ చేసి రక్షించాడు !

Mohammed Shami : ఘోర రోడ్డు ప్రమాదం…రిస్క్ చేసి రక్షించాడు !

by Bunty
Ad

జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న షమీ వ్యక్తిగతంగా చాలా నిరాడంబరంగా కనిపిస్తాడు ఉంటారు. ఆపదలో ఉన్నవారికి తన వంతు సహాయం చేస్తారు. తాజాగా షమీ చేసిన పనికి నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రపంచకప్ అలసటను పోగొట్టుకునేందుకు శనివారం అర్ధరాత్రి ఉత్తరాఖండ్లోని నైనిటాల్ కు వెళ్లాడు. నైనిటాల్ కు వెళుతుండగా షమీ కారు ముందు ఉన్న వాహనం ప్రమాదానికి గురైంది. మలుపు తిరుగుతుండగా కారు అదుపుతప్పి రోడ్డుపై పల్టీలు కొట్టింది.

Mohammed Shami rescues road accident victim in Nainital, shares video on social media

Mohammed Shami rescues road accident victim in Nainital, shares video on social media

వెంటనే షమీ కారు దిగి బోల్తా పడిన కారులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించాడు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. బోల్తా పడిన కారు ఫుటేజ్ తో పాటు షమీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అతను చాలా అదృష్టవంతుడు. దేవుడు అతనికి రెండవ జీవితాన్ని ఇచ్చాడు. నైనిటాల్ సమీపంలో నేను ప్రయాణిస్తున్నప్పుడు కారుకి ఎదురుగా ఉన్న అతని కారు అదుపుతప్పి కింద పడింది.

Advertisement

Advertisement

అతన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని షమీ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో పాటు క్రికెట్ అభిమానులు, నెటిజన్స్ షమీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన షమీ కష్టాలను అధిగమించి, కష్టపడి భారత క్రికెట్ అత్యుత్తమ బౌలర్లలో ఒకరిగా ఎదిగాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ లో షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. తన బౌలింగ్ తో ప్రత్యర్ధులను హడలెత్తించాడు. కేవలం ఏడు మ్యాచుల్లో 24 వికెట్లు పడగొట్టి, ప్రపంచకప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా షమీ నిలిచాడు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading