టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. అలాంటి మెగా ఇంట్లో ఇటీవల కోడలుగా అడుగుపెట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఇండస్ట్రీలో ప్రస్తుతం పాపులర్ హీరోయిన్గా కొనసాగుతున్న లావణ్య త్రిపాఠి…. మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
మిస్టర్ సినిమా సమయంలో ప్రేమలో పడ్డాయి హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్… పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక దీంతో నవంబర్ ఒకటో తేదీన ఇటలీలో వీరిద్దరి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి ఈ కుటుంబ సభ్యులు అలాగే టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.
Advertisement
ప్రస్తుతం పెళ్లి జీవితాన్ని గడుపుతున్న లావణ్య త్రిపాఠి పై కొంతమంది దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ కారణం ఆమె తాళిబొట్టు తీసివేయడం. వీరిద్దరి వివాహం జరిగి నెల రోజులు కూడా కాలేదు. తాజాగా వరుణ్ తేజ్ తో కలిసి ఫోటోలు దిగిన లావణ్య త్రిపాఠి… ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఆ ఫోటోలలో లావణ్య త్రిపాఠి మెడలో తాళిబొట్టు కనిపించలేదు. దీంతో నెటిజెన్స్ ఆమెపై విరుచుకుపడుతున్నారు. పెళ్లి జరిగి నెల రోజులు కాకముందే తాళి తీసేసావా అని మండిపడుతున్నారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!