కార్తీకమాసంలో మనం ఏ మంచి పని చేసినా కూడా దానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది కార్తీకమాసంలో దీపారాధన చాలా విశిష్టమైనది. దీపారాధన అంటే శరీరాన్ని మనసుని భగవంతునికి అర్పించే జ్ఞాన జ్యోతి ని వెలిగించడం. దీపావళి తర్వాత రోజు నుండి కార్తీక మాసం దాకా ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండాలి. దీపారాధన చేస్తే పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది దీపారాధన చేసేటప్పుడు ఏ ప్రమిదలో వెలిగించాలి అనే విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఏ రకం ప్రమిదలలో దీపారాధన చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
దీపారాధన చేయడానికి ముందు ఇదివరకు ఇత్తడి ప్రమిదల్ని ఉపయోగించేవారు దీపారాధన ఇందులో చేస్తే బంగారు ప్రమిదలలో వెలిగించినంత ఫలితం ఉంటుంది. పైగా ఆయుష్షు కూడా పెరుగుతుంది కంచు ప్రమిదలో చేస్తే మంచిది. కంచు ప్రమిదలో దీపారాధన చేస్తే రోగాలు బాధలు పోతాయి. అకాల మృత్యువు దరిచేరకుండా ఉంటుంది పంచలోహాలతో తయారుచేసిన ప్రమిదలలో దీపారాధన చేస్తే కుటుంబానికి సుఖశాంతులు కలుగుతాయి.
బంగారం, వెండి, రాగి, ఇత్తడి, కంచు కలిపి చేసిన ప్రమిధులని పంచలోహ ప్రమిదలు అంటారు. ఆవు నెయ్యితో మట్టి ప్రమిదలలో దీపారాధన చేస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది బియ్యం పిండిలో కొద్దిగా పసుపు కలిపి, ప్రమిద చేసి కార్తీకమాసంలో శివాలయంలో దీపారాధన చేస్తూ ఉంటారు అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఉసిరికాయలతో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే నవగ్రహాల దోషాలు తొలగిపోతాయి తులసి చెట్టు వద్ద దీపారాధన చేస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!