టీమిండియా జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్లో అద్భుతంగా రానించి రన్నరప్ గా నిలిచింది టీమిండియా. వరుసగా పది మ్యాచ్లు ఆడిన టీమిండియా నేరుగా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అనుహ్యంగా… ఫైనల్ మ్యాచ్లో టీమిండియా జట్టు గోరంగా ఓడిపోయింది. ఇక వన్డే వరల్డ్ కప్ 2023 పూర్తి కాగానే ఆస్ట్రేలియా తో టి20 మ్యాచ్లు ఆడుతోంది టీమిండియా.
Advertisement
ఇందులో యంగ్ స్టార్స్ ను సెలెక్ట్ చేసింది బీసీసీఐ. దీంతో ఈ యంగ్ స్టార్స్ టీమిండియా జట్టుకు సూర్య కుమార్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఈ టోర్నమెంట్ లో ముఖేష్ కుమార్ టీమిండియాలోకి ముఖ్య బౌలర్గా ఎంపిక అయ్యాడు. మొదటి మ్యాచ్ లో టీమిండియా తరఫున ఆడిన ముఖేష్ కుమార్… ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించాడు. చివరి ఓవర్ లో… స్టార్ బ్యాట్స్మెన్లు ఉన్నప్పటికీ కేవలం ఐదు పరుగులు ఇచ్చి తన సత్తా ఏంటో చూపించాడు ముఖేష్ కుమార్.
Advertisement
వాస్తవానికి స్టార్ బౌలర్ గా ఉన్న ముఖేష్ కుమార్ మొదట బ్యాటింగ్ అద్భుతంగా చేసేవాడట. అయితే క్రికెట్ లోకి రాకముందు క్రికెట్ కిట్ కొనుక్కునేందుకు డబ్బులు లేవట ముఖేష్ దగ్గర. దీంతో బ్యాటింగ్ కంటే బౌలింగ్ చేయడమే బెటర్ అని నిర్ణయం తీసుకున్నాడట ముఖేష్ కుమార్. ఇక ఆ తర్వాత అద్భుతంగా బౌలింగ్ చేసి పూర్తిస్థాయిలో మౌనంగా మారిపోయాడు ముఖేష్ కుమార్. ఇప్పుడు టీమిండియాలో కూడా సక్సెస్ఫుల్ బౌలర్ గా కొనసాగుతున్నాడు.