చాలామంది ఈ రోజుల్లో వ్యాపారాలని స్టార్ట్ చేస్తున్నారు వ్యాపారాల ద్వారా కోట్లలో సంపాదిస్తున్నారు. ఒక కోడలు లక్షాధికారి అయిపోయింది. దానికి కారణం తన అత్త. ఇక ఈమె చేసిన వ్యాపారం గురించి చూసేద్దాం. చెన్నైకి చెందిన సోనమ్ అనే యువతి అదే ప్రాంతానికి చెందిన అజయ్ ని పెళ్లి చేసుకుంది. చాలామంది అత్తలులా కాకుండా ఈ అత్త మాత్రం కూతురులానే ఆమె ని చూసుకునేది అయితే కొన్నాళ్ళకి అత్త చనిపోయింది చాలా బాధపడి పొంగిపోయింది. సోనం ఒక రోజు తన అత్త గదిని శుభ్రం చేసే సమయంలో ఆమెకి ఒక డైరీ కనపడింది ఆ డైరీ ఏ ఆమెను పారిశ్రామికవేత్తగా మార్చేసింది.
Advertisement
Advertisement
వంటలకు సంబంధించిన రెసిపీలు ఆ డైరీలో చాలా ఉన్నాయి. వీటి అన్నిటినీ అలాగే ఎందుకు వదిలేయాలని 10 మందికి పంచితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఫుడ్ బిజినెస్ చేస్తే బాగుంటుందని భర్తతో పాటుగా వ్యాపారాన్ని మొదలు పెట్టింది. డైరీ లో తనకి ఇష్టమైన గోంగూర చట్నీ దగ్గర నుండి పొడులు ఇతర వంటకాల గురించి ఉన్నాయి. ఆ తర్వాత వీటిని ప్రయత్నించాలనుకుని అలాంటి వంటకాలు తయారుచేసి భర్త అజయ్ తో పాటుగా దగ్గర బంధువులకి అందించడం మొదలుపెట్టింది.
అవి తిన్న వాళ్ళందరూ కూడా ప్రోత్సహించారు. ప్రేమ్ ఇటాసి అనే పేరుతో వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ప్రారంభంలో సుమారు పది లక్షల పెట్టుబడి పెడుతూ బిజినెస్ మొదలుపెట్టగా తక్కువకాలంలోనే ఆన్లైన్ రిటైల్ ప్లాట్ ఫామ్ నుండి ఆర్డర్లు పొందగలిగింది. అత్త డైరీ వలన ఆమె పెద్ద వ్యాపారవేత్తగా మారింది. ప్రస్తుతం వీరి ఉత్పత్తులు స్టోర్లలో మాత్రమే కాకుండా ఈ కామర్స్ వెబ్సైట్లో కూడా లభిస్తున్నాయి.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!