ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అన్నం తీసుకోవడం తగ్గిస్తున్నారు. బదులుగా చపాతీని ఎంచుకుంటున్నారు. రాత్రి సమయాల్లో అన్నం తినడం కంటే చపాతీని తినడానికే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. చపాతీలు చేసుకోవడానికి మనం కనీసం అరగంట ముందే పిండి కలుపుకుని పెట్టుకుంటాము. ఆ పిండి ముద్దపై ఏదైనా తడి క్లాత్ వేసి.. కొంత నానాక చిన్న చిన్న ఉండలు చేసి చపాతీ చేయడం ప్రారంభిస్తాము. అయితే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, చపాతీలు ఒక్కోసారి స్టవ్ మీద వేసి కాల్చగానే గట్టిగా అయిపోతాయి.
Advertisement
అయితే.. ఈ చపాతీలు మెత్తగా, సాఫ్ట్ గా రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఈ ఆర్టికల్ లో చూసేయండి. చపాతీ పిండిని కలిపేటప్పుడు ఉత్త నీటిని కాకుండా.. కొంత గోరు వెచ్చని నీటిని వేసి కలిపి, కొన్ని గోరు వెచ్చని పాలని కూడా వేసి కలిపి.. కాసేపు కదలకుండా ఉంచి.. ఆ తరువాత చపాతీలు చేస్తే చాలా మెత్తగా వస్తాయి. అలాగే పిండిని కలిపే సమయంలోనే కొంత నెయ్యిని కూడా వేస్తె బాగుంటుంది. అలాగే చపాతీలు చేసేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Advertisement
చిన్న చిన్న ఉండలు చేసి చపాతీలు చేసేటప్పుడు ఎక్కువ పొడి పిండి చల్లకూడదు. కొంతమంది అతుక్కుపోకుండా ఉండడం కోసం ఎక్కువగా పిండి చల్లేస్తూ ఉంటారు. అయితే.. ఇలా చేయకూడదు. అలాగే.. వాటిని రోటీలా వత్తిన వెంటనే కాల్చేస్తే సాఫ్ట్ గా ఉంటాయి. లేకపోతే పొడిగా అయిపోతాయి. అలాగే.. పెనం బాగా వేడెక్కిన తరువాత మాత్రమే చపాతీలను కాల్చాలి. రెండు మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు అటు ఇటు తిప్పకూడదు. చపాతీలను కాల్చేటప్పుడు రెండు వైపులా కొంచం నెయ్యి వెయ్యాలి. చపాతీలను కాల్చిన తరువాత ఓపెన్ గా ప్లేట్ లో పెట్టడం కంటే.. ఒక గిన్నెలో లేదా హాట్ బాక్స్ లో పెట్టడం ఉత్తమం.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!