పెళ్లి అనేది అందరి విషయంలో నూరేళ్ళ పంట. కానీ.. కొందరికి పెళ్లి విషయంలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. అనుకోని కారణాల వలన పెళ్లి ఆలస్యం అవుతూ ఉంటుంది. అనుకోని వాయిదాలు పడుతూ ఉంటాయి. అయితే.. ఇలాంటి పరిస్థితులలో తులసి తో కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇక్కట్లు తొలగి వివాహం త్వరగా చేసుకోగలుగుతారు. కొందరికి పెళ్లి విషయాల్లో ఇబ్బందులు ఎదురవ్వడమే కాకుండా.. సంబంధాలు కుదిరిన ముందుకు వెళ్ళకపోవడం, పెళ్లి సమయానికి ఆగిపోవడం, పెళ్ళైన వెంటనే విడాకులు తీసుకోవాల్సి రావడం వంటివి జరుగుతుంటాయి. అటువంటి వారు తులసి తో ఈ పరిహారాలను పాటించాలి.
Advertisement
Advertisement
తులసి తో వివాహం రోజున శ్రీమహా విష్ణువుని పూజించాలి. శ్రీమహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతిపాత్రమైనది. తులసి ఆకులతో ఆయనను పూజిస్తే.. ఆయన సంతృప్తి చెంది మీ వివాహానికి అడ్డంకులు లేకుండా చూసుకుంటారు. తులసి వివాహం రోజున కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి మీ ప్రధాన ద్వారం వద్ద ఉంచండి.
ఇలా చేయడం వలన వివాహం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, లేదా పెళ్లి అయ్యిన భార్యాభర్తల మధ్య ఏవైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. సమస్యలు తొలగిపోవడమే కాకుండా.. భార్యాభర్తల మధ్య అనుబంధం మరింత బలబడుతుంది. తులసి మాతకీ చేసిన అలంకరణని, నైవేద్యాలను ఇతర స్త్రీలకూ దానం చేయాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!