కర్ణాటకలో వీకెండ్ కర్ఫ్యూను ఎత్తివేశారు. యథావిధిగా నైట్ కర్ఫ్యూను కొనసాగిస్తున్నారు.
గోవాలో బిజెపికి బిగ్ శాఖ తగిలింది. బీజేపీ సభ్యత్వానికి ఉత్పల్ పారికర్ రాజీనామా చేశారు. గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ కుమారుడే ఉత్పల్ పారికర్ కాగా ఆయన పనాజీ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.
Advertisement
తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురంలోని ఒక పాఠశాలలో 23 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. హైస్కూల్లో ఉపాధ్యాయ, ఇతర సిబ్బందిలో 8 మందికి, విద్యార్థులు 15 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
భారత్ లో కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.37 లక్షల కేసులు నమోదు అయ్యాయి.
Advertisement
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మూడేళ్ల వైవాహిక జీవితం తరవాత మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. సరోగసి పద్దతి ద్వారా ప్రియాంక బిడ్డకు జన్మనిచ్చింది.
ఇండియన్ హాకీ లో కరోనా కలకలం రేగింది. 16 మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.
కరోనా వ్యాక్సిన్ కు సంబందించిన కోవిన్ యాప్ లో కేంద్రం మార్పులు తీసుకువచ్చింది. ఇదివరకు ఒక నంబర్ తో 4గురికి వ్యాక్సిన్ వేసే వాళ్ళు.ఇప్పటినుండి ఆ సంఖ్య 6కు పెంచారు.
ఇన్స్ట గ్రామ్ లో కంటెంట్ క్రియేటర్ లకు ఆదాయం వచ్చే సదుపాయాన్ని తీసుకువచ్చారు. కంటెంట్ చూడాలంటే సబ్ స్క్రైబ్ చేసుకోవాలి. ఆ ఆప్షన్ క్రియేటర్స్ చేతిలోనే ఉంటుంది.
జంతువు లకు కూడా కరోనా వ్యాక్సిన్ లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవల చెన్నై లో కరోనా భారిన పడి 2 సింహాలు మృతి చెందాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
యెమెన్ లోని ఓ జైలుపై సౌదీ దాడి చేసింది. వైమానిక దాడి చేయడం తో 100మంది మృతి చెందారు.