కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. కార్తీకమాసం లో కొన్ని పద్ధతుల్ని పాటిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది కార్తీకమాసంలో ప్రత్యేకంగా శివుడిని ఆరాధిస్తూ ఉంటారు. అలానే కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద పూజలు కూడా చేస్తూ ఉంటారు. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద ఎందుకు పూజలు చేయాలి…? దాని వెనక అర్థం ఏంటి అనే విషయాన్ని ఈరోజు చూద్దాము. కార్తీకమాసం అంటే శివుడికి ఎంతో ప్రత్యేకమైన మాసం కార్తీక మాసం అంతటా కూడా చాలామంది మాంసాహారానికి దూరంగా ఉంటారు. ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటారు.
ప్రత్యేకించి శివుడుని ఆరాధిస్తూ ఉంటారు. కార్తీకమాసం లో వనభోజనాలు కూడా చేస్తూ ఉంటారు బంధుమిత్రులతో కలిసి తోటల్లో ఉసిరి చెట్ల కింద కూర్చుని భోజనాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ మాసంలో ఉసిరి చెట్టుని ప్రత్యేకించి పూజిస్తారు. ఉసిరి చెట్టులో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇద్దరు కొలువై ఉంటారు అని పెద్దలు కూడా అంటూ ఉంటారు. కార్తీకం అంటే శివ కేశవులు ఇద్దరికీ చాలా ఇష్టం. ఉసిరి చెట్టు కింద ఎందుకు ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు అనే విషయానికి వచ్చేస్తే ఈ చెట్టుని ధాత్రి వృక్షం అంటారు. ఆ చెట్టులోని ప్రతీతి కూడా ప్రజలకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
Advertisement
Advertisement
ఉసిరి చెట్టు ఆరోగ్య సంజీవిని ఆ చెట్టుగాలి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పోషణాలు చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది ఉసిరి చెట్టు మూలంలో విష్ణుమూర్తి ఉన్నారు కాండంలో శివుడు పై భాగంలో బ్రహ్మదేవుడు ఉసిరి ఆకులలో సకల దేవతలు కొలువై ఉంటారని భక్తుల నమ్మకం అందుకని ఉసిరి చెట్టు కింద కూర్చుని పూజలు చేస్తూ ఉంటారు ఉసిరి చెట్టు కింద కూర్చుని పూజలు చేయడం వలన దోషాలు తొలగిపోతాయి నరదిష్టి కూడా తగలదు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!