పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కొంతకాలం కలిసి జీవించారు తర్వాత విడిపోయారు రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి దూరంగా ఉంటున్నారు. లేటెస్ట్ గా ఈమె రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరావు జీవిత కథ ఆధారంగా తెర మీదకు తీసుకువచ్చారు.
Advertisement
ఒక ఇంటర్వ్యూలో రేణు దేశాయి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. వర్క్ షూటింగ్ విషయాల్లో పర్టికులర్ గా ఉంటానని రేణు దేశాయ్ చెప్పారు. సినిమాలో ఒక క్యారెక్టర్ ఇచ్చి మన మీద డబ్బు ఖర్చు చేస్తున్నారంటే కచ్చితంగా రెస్పాన్సిబుల్ గా ఉండాలని రేణు దేశాయ్ అన్నారు ఈరోజు దాకా నేను నా సొంత పిల్లల్ని కూడా కొట్టలేదు.
Advertisement
కనీసం దోమల్ని కూడా చంపను అని రేణు దేశాయ్ చెప్పడం జరిగింది అటువంటి వ్యక్తిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు మనం ఎంత మంచి చేసినా మన వెనకాల చెడుగా మాట్లాడే వారు మాట్లాడుతూ ఉంటారు అని రేణు దేశాయ్ అన్నారు ఇలా కాదు అలా కాదు అని మొదట్లో వాదించే దానిని కానీ ఇప్పుడు మీరు ఏమైనా మాట్లాడుకోండి నాకు అనవసరం అని వదిలేస్తున్నాను అని రేణు దేశాయ్ చెప్పారు.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!