Home » పాకిస్థాన్ పరువు తీసిన రికీ పాంటింగ్… ఏం చెప్పారో తెలుసా…?

పాకిస్థాన్ పరువు తీసిన రికీ పాంటింగ్… ఏం చెప్పారో తెలుసా…?

by Sravya
Ad

పాకిస్తాన్ వరల్డ్ కప్ లో దారుణ ప్రదర్శనతో టోర్నీ మధ్యలోనే ఇంటికెళ్ళిపోయింది పాకిస్తాన్ జట్టు సరైన ప్రదర్శన చేయకుండా విఫలం అయిపోయింది. పాక్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వరల్డ్ కప్ లో పాక్ ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీ నుండి బాబర్ అజాం తప్పుకున్నారు. ఇక పాక్ కొత్త కెప్టెన్ గా షాన్ మసూద్ ని నియమించింది పిసిబి. టీ20 లకు స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిదిని ఎంపిక చేశారు. వన్డే ఫార్మాట్ కి మాత్రం కెప్టెన్ ని ఎంపిక చేయలేదు.

Advertisement

త్వరలోనే టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది. పాకిస్తాన్ వన్డే ఫార్మేట్ కి మాత్రం కెప్టెన్ ని సెలెక్ట్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించబోతోంది పాకిస్తాన్ టీం పరువు తీశాడు ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్. అతను ఏమన్నాడు అనే విషయానికి వచ్చేస్తే… ఆస్ట్రేలియాతో జరగబోయే మూడు మ్యాచ్లలో టెస్ట్ సిరీస్ కోసం పాక్ జట్టు అసిస్ వెళ్లనుంది.

Advertisement

ఫోక్స్ క్రికెట్ తో మాట్లాడుతూ పాకిస్తాన్ టీం గతంలో ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చినప్పుడు జర్నలిస్టులతో ఒక మాట అన్నాడు. పాకిస్తాన్ అత్యంత చెత్త బౌలర్లతో మా దేశానికి వచ్చిందని ఇప్పుడు ఆ మాటలని అన్నందుకు నేను ఫీల్ అవుతున్నాను. త్వరలో మా దేశానికి రాబోయే పాక్ బౌలింగ్ టీం అప్పటికంటే మరింత అధ్వానంగా ఉంది అని పాకిస్తాన్ పరువు తీశాడు. వరల్డ్ కప్ కి ముందు వరల్డ్ క్లాసు బౌలర్లు మొదట్లో ఉన్నారని గొప్పలు చెప్పుకొచ్చిన పాకిస్తాన్ ప్రపంచకప్ లో దారుణంగా విఫలం అయిపోయింది.

స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading