Home » Marriage After 30 : 30 ఏళ్ళు దాటాక పెళ్లి చేసుకుంటే జరగోయేది ఇదేనా ? ఇన్ని నష్టాలు ఉన్నాయా ??

Marriage After 30 : 30 ఏళ్ళు దాటాక పెళ్లి చేసుకుంటే జరగోయేది ఇదేనా ? ఇన్ని నష్టాలు ఉన్నాయా ??

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

పెళ్లి చేసుకోవడానికి సరైన వయస్సు గురించి అంతులేని చర్చ జరుగుతూనే ఉంటుంది. చాలా మంది ఇరవై నుంచి.. ఇరవై ఐదు సంవత్సరాల వయసు పెళ్ళికి అనుకూలం అని చెప్తుంటారు. నిజానికి.. ఆ వయసు కంటే ముప్పయ్యేళ్ల వయసు వచ్చాకే లైఫ్ లో పూర్తిగా సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది.

30weds

Advertisement

ఆ వయసు వచ్చాకే ఈ సొసైటీని పూర్తిగా అర్ధం చేసుకోవడానికి సాధ్యం అవుతుంది. ముప్పై కంటే తక్కువ వయసులో పెళ్లి చేసుకోవడానికి, ముప్పై దాటాకా పెళ్లి చేసుకోవడానికి చాలా తేడాలు ఉన్నాయి. అవేంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

ముప్పయ్యేళ్లు వచ్చే సరికి మనకి చాలా రకాల మనుషులు పరిచయం అవుతారు. స్నేహాలు ఉంటాయి. అందరిని బాగా అర్ధం చేసుకోగలుగుతూ ఉంటాము. మనకి ఏమి కావాలి అన్న స్పష్టత ఉంటుంది. మన పార్ట్ నర్ ని అర్ధం చేసుకోవడం మనకి మరింత ఈజీ అవుతుంది. జీవితాన్ని అర్ధం చేసుకోవాలంటే కనీసం ముప్పయ్యేళ్లు అయినా రావాలి. జీవితంలో వచ్చే ఒడిదుడుకులను అర్ధం చేసుకునే పరిపక్వత వచ్చాక భాగస్వామితో జీవితాన్ని ప్రారంభించడం బాగుంటుంది. ఇరవైల వయసులో ఈ పరిపక్వత ఉండదు. జీవితంలో స్థిరపడి ఉండము. భాగస్వామి పోషణ, అర్ధం చేసుకోవడంలో వైఫల్యాలు వస్తుంటాయి.

Advertisement

అయితే.. ఇబ్బందులేంటంటే.. ముప్పై దాటేసరికి శరీరంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ముప్పై దాటాక పిల్లలని కనడం అనేది నిజంగా కష్టమైన విషయమే. నార్మల్ డెలివరీ కంటే సిజేరియన్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ప్రేమ కూడా వయసుని బట్టి మారుతుంది. ఇరవైల వయసులో అందులో ఆకర్షణని మాత్రమే చూస్తాము. చిన్న మిస్ అండర్స్టాండింగ్ వచ్చినా తట్టుకోలేము. అదే ముప్ఫై ఏళ్ళు దాటాక ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ముప్పయ్యేళ్లు వచ్చేసరికి మనలో మెచూరిటీ పెరుగుతుంది కూడా. సామాజిక జీవితం, కుటుంబ జీవితం రెండిటిని మానేజ్ చేయడం నేర్చుకుంటాము.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading