కార్తీక మాసం హిందువులకు పరమ పవిత్రమైన మాసం. ఈ మాసం వస్తే చాలు హిందువులు ఉదయాన్నే చన్నీటి స్నానాలు, దీపాలు పెట్టుకోవడం వంటివి చేస్తారు. కొందరు ఉపవాసాలు ఉండి తమకు తోచిన విధంగా ఆ పరమేశ్వరుడిని పూజించుకుంటారు. స్నానం, దీపాలకు ఈ మాసంలో చాలా ప్రాధాన్యత ఉంది. అయితే.. కార్తీక మాసంలో అసలు ఏమేమి చెయ్యాలి? ఏ పనులు చెయ్యకూడదో ఇప్పుడు తెలుసుకోండి.
Advertisement
ప్రతి ఏడాది దీపావళి అమావాస్య తరువాత కార్తీక మాసం ప్రారంభం అవుతుంది. అయితే.. ఈ ఏడాది దీపావళి రెండు రోజులు రావడంతో.. నవంబర్ 14 న కార్తీక మాసం ప్రారంభం అయ్యింది. ఈ నెల ఆధ్యాత్మిక మాసం. చాలా మంది నియమ నిష్టలతో పూజల్లో నిమగ్నమై ఉంటారు. ఇది శివకేశవులకు ప్రీతికరమైన మాసం. మాసంలో మొదటి పక్షం శివునికి, రెండవ పక్షం రోజులు విష్ణువుకు అత్యంత ప్రియమైన మాసం. అయితే.. కార్తీక మాసంలో ఏమేమి పూజలు చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకోండి.
Advertisement
కార్తీక మాసంలో వచ్చే శుక్ల చవితి రోజు నాగుల చవితి వస్తుంది. నవంబర్ 17 న ఈ పండుగ జరుపుకోవాలి. నాగుల చవితిరోజు పుట్టలో పాలు పోయడం వలన దుఃఖాలు తొలగుతాయి. ఇదే నెలలో సుబ్రమణ్య షష్టి కూడా వస్తుంది. ఆరోజున ఎర్రని వస్త్రాన్ని లేదా కండువాని దానం చేస్తే సంతాన యోగం లభిస్తుందని అంటారు. నవంబర్ 27న రెండవ కార్తీక సోమవారం వస్తుంది. అది ఎంతో పవిత్రమైనది. శివుడికి ఈరోజు జ్వాలా తోరణం చేస్తారు. ఆరోజున జ్వాలా తోరణాన్ని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయి. కొత్తగా పెళ్లి అయ్యిన వారు పదహారు రకాల పండ్లతో పూజించాలి. పూజలు చేసుకునే వారు గొడవలు పెట్టుకోవద్దు. ఉల్లి, వెల్లుల్లిని దూరంగా ఉంచండి. ఈ కాలంలో నువ్వుల నూనెను దీపారాధనకు తప్ప ఇతర అవసరాలకు వాడవద్దు. మినుములు ఈ నెల రోజులు తినకండి. నలుగు పెట్టుకుని స్నానం చెయ్యకండి. ఈ మాసం శివ, వైష్ణవులకు ప్రీతికరమైన మాసం. సోమవారాలు ఉపవాసం ఉండి, శివ దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం లభిస్తుంది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!