ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గురించి పరిచయం చేయక్కర్లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కి షాక్ ఇచ్చింది. వివరాలు చూస్తే… 100 కోట్ల రూపాయల పోంజీ స్కామ్ కి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ కి నోటీసులు ఇచ్చారు. చెన్నైలో వచ్చేవారం ప్రజాష్ రాజ్ విచారణకు రావాలని చెప్పారు. తిరుచ్చి కి సంబంధించిన ఒక జువెలరీ గ్రూపు మీద నవంబర్ 20వ తేదీన దాడిచేసి 23. 70 లక్షల లెక్క చెప్పని నగదు అలానే కొన్ని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నాక ప్రకాష్ రాజ్ కి ఈడి అధికారులు నోటీసులు పంపింది.
Advertisement
తిరుచ్చికి సంబంధించిన ఈ ఆభరణాల సంస్థకు ప్రకాష్ రాజ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ప్రణవ్ జూవెలర్స్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ కావడంతో ఈడీ అధికారులు విచారించనున్నారు. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం ఎంటర్ చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది.
Advertisement
విచారణ జరుపుతోంది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో 100 కోట్ల రూపాయలను ప్రణవ్ జువెలర్స్ సేకరించిందని తెలుస్తోంది. ఎక్కువ రిటర్న్స్ ఇస్తామని మోసం చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ వాళ్ళ నుంచి ఫీజు తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ కి నోటీసులు ఇవ్వడంతో అంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!