ప్రపంచకప్ ముగియడంతో బీసీసీఐ కెప్టెన్ రోహిత్ శర్మ మరియు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ తో సమావేశం నిర్వహించాలని భావిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో కొనసాగడంపై రోహిత్ శర్మ ఆలోచనలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ పరిస్థితుల్లో జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మ కొనసాగుతాడా? లేదా? అనేది చూడాలి. ప్రస్తుతం రోహిత్ శర్మ వయస్సు 36 ఏళ్ళు. అంటే రోహిత్ ఎక్కువకాలం క్రికెట్ లో కొనసాగే అవకాశం లేదు.
ఈ వయసులో జట్టుకు సారధ్యం వహించడం కష్టమైన పని అంటున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితుల్లో రోహిత్ పై ఒత్తిడి పడకుండా ఉండేందుకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన ఆశ్చర్యపోనవసరం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం టి20కే తన పేరును పరిగణలోకి తీసుకోకుంటే అభ్యంతరం లేదని రోహిత్ శర్మ ఇప్పటికే సెలెక్టర్లకు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో రోహిత్ శర్మ టి20 కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనని తెలుస్తోంది.
Advertisement
Advertisement
మరోవైపు యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని భారత సెలెక్టర్లు భావిస్తున్నారు. తదుపరి వన్డే వరల్డ్ కప్ 2027 లో జరగనుంది. అప్పటికి రోహిత్ శర్మ వయసు 40ఏళ్లు. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ ఏడాది చివర్లో జరగనుంది. ఈ టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ ఏడాదిలో భారత్ 6 వన్డేలు మాత్రమే ఆడనుంది. అంటే చాంపియన్స్ ట్రోఫీ వరకు రోహిత్ వన్డేల్లో కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ వదిలివేస్తే అతని స్థానంలో బాధ్యత తీసుకునేది ఎవరన్న దానిపై బీసీసీఐ టీం మేనేజ్మెంట్ వద్ద ప్రణాళిక ఉందా అనేది కూడా ప్రశ్నగా మారింది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.