లింగ మార్పిడి చేయించుకుని మహిళలుగా మారిన వారు ఇకపై మహిళల క్రికెట్ జట్టులో ఆడడానికి వీలు లేదంటూ ఐసీసీ సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ట్రాన్స్ జెండర్ లను మహిళల క్రికెట్ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. 9 నెలల పాటు దీనిపై అనేక క్రికెట్ బోర్డులతో చర్చలు జరిపిన ఐసీసీ తమ నిర్ణయం నిర్ణయాన్ని ప్రకటించింది.
కొన్నేళ్ల క్రితం ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పిస్తామంటూ అందరి ప్రశంసలు అందుకున్న ఐసీసీ మళ్లీ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మహిళల క్రికెట్ లో న్యాయబద్ధత, ఇంకా వారి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నామని ఐసీసీ ప్రకటించింది.
Advertisement
Advertisement
ఒలంపిక్స్ లో క్రికెట్ చేరుతున్న ఈ టైములో అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం చేసిన సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.