ఈసారి వరల్డ్ కప్ విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. అయితే ఆస్ట్రేలియా విజేతగా నిలిచినా కూడా జట్టుకి నిరాశ ఎదురయింది ప్రపంచ కప్ తో స్వదేశం చేరిన ఆటగాళ్ళకి కనీస స్వాగతం కూడా లభించలేదు. అక్కడి అభిమానులు ప్రభుత్వ అధికారులు ఆసీస్ విజయాన్ని లైట్ తీసుకోవడం జరిగింది.
Advertisement
ఎయిర్పోర్ట్ మొత్తం బోసిపోయి కనపడింది ఇలా జరగడంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు తీవ్ర నిరాశకి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. భారత్ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నని వరుస ఓటములతో ప్రారంభించిన ఆస్ట్రేలియా అసాధారణ ప్రదర్శనతో ఫైనల్స్ చేరింది.
Advertisement
ఫైనల్ లో కూడా గెలిచింది భారత్ పై ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది తర్వాత భారత్ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రపంచకప్ అందుకున్నారు. వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత భారత్ తో టీ20 సిరీస్ కోసం కొంతమంది క్రికెటర్లు ఇక్కడే ఉండిపోయారు కెప్టెన్ తో సహా కొంతమంది సీనియర్ ఆటగాళ్లు స్వదేశం చేరుకున్నారు సాధారణంగా కప్ గెలిచిన తర్వాత ఆ టీం కి ఘనస్వాగతం లభిస్తుంది.
కానీ ఈ విషయంలో ఆస్ట్రేలియా క్రికెటర్ లకి మాత్రం నిరాశ ఎదురయింది కప్పుతో సిడ్ని ఎయిర్పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఎలాంటి స్వాగతం కూడా లభించలేదు మీడియా వాళ్ళు మాత్రమే ఫోటోలు తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత్ క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో అసలు ప్రపంచ కప్ మ్యాచ్ లని ప్రసారం చేశారా అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!