Home » ఈ చెట్లను ఇంట్లో పెంచుకుంటున్నారా…అయితే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే..!

ఈ చెట్లను ఇంట్లో పెంచుకుంటున్నారా…అయితే సమస్యలు కొని తెచ్చుకున్నట్టే..!

by AJAY
Ad

ఇంట్లో పెంచుకునే చెట్ల వల్ల కూడా పరిస్థితులు మారుతూ ఉంటాయి. కొన్ని చెట్లను పెంచుకోవడం వల్ల ఆర్థిక వృద్ధి తో పాటు ఆరోగ్యం, మనశ్శాంతి వస్తాయి. ఇక మరి కొన్ని చెట్ల వల్ల అనారోగ్యం ఆర్థిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. ఇంట్లో చెట్లను పెంచుకోవడం ఎంతో అవసరం. అయితే ఎలాంటి చెట్లను పెంచాలి ఎలాంటి చెట్లను పెంచకూడదు అన్నది మాత్రం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి.

Tulasi

Advertisement

Advertisement

కాబట్టి ఇంట్లో ఎలాంటి చెట్లు పెంచుకుంటే మేలు జరుగుతుంది….ఎలాంటి చెట్లను పెంచితే ఇబ్బందులు వస్తాయి అన్నది ఇప్పుడు చూద్దాం. ఇంట్లో తులసి మొక్కను కచ్చితంగా పెంచుకోవాలి. కృష్ణ తులసి తో పాటు లక్ష్మీ తులసి ని కూడా పెంచుకోవాలి. ఒకవేళ ఇంటి వద్ద స్థలం ఎక్కువగా ఉంటే ఉసరిక అంటే ధాత్రి చెట్టును మారేడు చెట్టును పెంచుకోవాలి. అంతేకాకుండా ఇళ్లలో ముళ్ళు ఉండే చెట్లను అస్సలు పెంచుకోకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా ఆకులు లేదా కాడలు కత్తిరిస్తే పాలు వచ్చే చెట్లను ఇంటివద్ద పెంచుకోకూడదు. అంటే పాల సముద్రం లాంటి చెట్లను పెంచుకోకుడదు. చింత చెట్టును కూడా ఇంటి వద్ద పెంచుకోకుడడు అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే ఇంటి వద్ద పెరడు ఉన్నట్లయితే వెనక భాగంలో ముళ్ళు ఉండే చెట్ల లో నిమ్మ, దానిమ్మ లాంటి చెట్లను పెంచుకోవచ్చు.

Visitors Are Also Reading