ప్రపంచకప్ లీగ్ దశలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన టీమిండియా ఫైనల్ లో తడబడింది. సమిష్టిగా రాణిస్తూ వరుస విజయాలు అందుకున్న రోహిత్ సేన టైటిల్ మ్యాచ్ లోను ఏ రకంగానూ రాణించలేదు. ఆసీస్ బ్యాటర్ల దాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేస్తే బౌలర్లు కూడా ఏం చేయలేకపోయారు. దీంతో భారత్ 240 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
లక్ష్య చేదనలో తోలుత ఆసిస్ ను కట్టడి చేసిన బూమ్రా, శమీ మిడిల్ ఓవర్లో వికెట్లు పడగొట్టలేకపోయారు. దీంతో ట్రావిస్ హెడ్ దాటిగా ఆడటం, దాంతో మానస్ లబుషేన్ సహకారం ఆసీస్ విజయానికి బాటలు వేసింది. మరోవైపు ఇదే విరాట్ కోహ్లీకి చివరి వరల్డ్ కప్ కావచ్చు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ భావిస్తున్నట్టుగా కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటిస్తే బిజినెస్ రంగంలో స్థిరపడాలని అనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ తన మేనేజర్ బంటి సజ్దేహ్ ను తొలగించినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement
విరాట్ కోహ్లీ వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను కార్నర్ స్టోర్ అనే కంపెనీ చూసుకుంటుంది. బంటి సజ్దేహ్ ఈ కంపెనీకి ఓనర్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రపంచకప్ ముగిసిన వెంటనే బంటి సజ్దేహ్ ని కోహ్లీ తొలగించడం చర్చనీయాంశమైంది. ఎందుకంటే కోహ్లీ సొంతంగా ఓ కంపెనీని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ కు సంబంధించిన అంశాలను అనుష్కశర్మ చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.