ఐసీసీ ప్రపంచ కప్ 2023 తుది పోరులో మరోసారి భారతజట్టుకి పరాభవం తప్పలేదు. గుజరాత్ లోని ప్రతిష్టాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఆరవసారి వరల్డ్ కప్ విజేతగా ఆవిర్భవించింది. తోలుత ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న టీమిండియాను 240 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా ఛేదించింది. ఇక ఈ వరల్డ్ కప్ లో ఒక్కసారి కూడా టీమిండియా ఓడిపోకపోవడానికి ప్రధాన కారణం బౌలర్సే.
ప్రతి మ్యాచ్ లో కూడా పోటీపడి వికెట్లు నేలకూల్చుతూ వచ్చిన బౌలర్లు ఫైనల్స్ లో చేతులెత్తేశారు. నాలుగు వికెట్లే తీయగలిగారు. ఇక ఈ ఓటమి సోషల్ మీడియాలో సరికొత్త డిమాండ్స్ కి తెరతీసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలో, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగిన మూడు ఐసీసీ వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్స్ లో టీమిండియా ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. 2015 ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించిన వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా అంచనాలని అందుకోలేకపోయింది. సిడ్ని క్రికెట్ గ్రౌండ్స్ లో జరిగిన సెమీఫైనల్ లో ఇదే ఆస్ట్రేలియా జట్టు చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఫైనల్స్ కి చేరుకోలేకపోయింది. 95 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది ఆసిస్. 2019లో ఇంగ్లాండ్ లో జరిగిన వరల్డ్ కప్ లో కూడా టీమిండియాకే ఎదురుగా నిలిచింది.
Advertisement
Advertisement
టోర్నమెంట్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించినప్పటికీ సెమీఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోవాల్సి వచ్చింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 239 పరుగుల లక్ష్యాన్ని చేదించలేకపోయింది భారత్. 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఈ మూడు వరల్డ్ కప్ సమయంలో కేంద్రంలో బిజెపినే అధికారంలో ఉంది. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటే ఎప్పటికీ భారత్ వరల్డ్ కప్ ను అందుకోలేదు అనే అభిప్రాయాన్ని కొంతమంది క్రికెట్ అభిమానులు పోస్ట్ చేస్తున్నారు. క్రికెట్ ని కూడా కాషాయమయం చేయడం వల్లనే ఈ దుస్థితి తలెత్తింది అంటూ కొంతమంది కాంగ్రెస్ వాదులు ధ్వజమెత్తుతున్నారు.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.