సినీ ప్రేమికులకు రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1985 సంవత్సరంలో “భలేమిత్రులు” చిత్రం ద్వారా కథానాయికగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినప్పటికీ రమ్యకృష్ణకి పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత రమ్యకృష్ణ నటించిన అల్లుడుగారు సినిమాతో రమ్యకృష్ణ కెరియర్ మారిపోయింది. ఇక ఆ సినిమా అనంతరం రమ్యకృష్ణకు వరుసగా అవకాశాలు వచ్చాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగింది.
Advertisement
రమ్యకృష్ణ ఇప్పటికీ 50 పదుల వయసు దాటినప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక రమ్యకృష్ణ కెరీర్ లోని అత్యంత గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం “నరసింహ” అనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో నటించడానికి రమ్యకృష్ణ వద్దకు వెళ్లి స్టోరీ చెబితే రమ్యకృష్ణ ముందుగా చేయనని చెప్పిందట. నేను సౌందర్యం ముఖం మీద కాలు పెట్టడం ఏంటి? అలా చేయడం నాకు నచ్చలేదు? నేను చేయను అని రమ్యకృష్ణ చెప్పిందట. కానీ డైరెక్టర్ రవికుమార్, సౌందర్య కలిసి బలవంతం చేసి ఆ పాత్రలో రమ్యకృష్ణని నటించేలా చేశారట.
Advertisement
ఈ విషయాన్ని స్వయంగా రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ సీన్ చేసే సమయంలో రమ్యకృష్ణ చాలా ఏడ్చిందట. సౌందర్య చాలా పెద్ద హీరోయిన్. నేను అంత పెద్ద హీరోయిన్ ని కాదు. అలా చేస్తే సౌందర్య ఫ్యాన్స్ అసలు ఊరుకోరు అని రమ్యకృష్ణ చెప్పిందట. కానీ సౌందర్య ఏం పరవాలేదు, ఈ సీన్ నువ్వు చేయాల్సిందే అని చెప్పిందట. ఇక ఆ సీన్ చేసే సమయంలో రమ్యకృష్ణ చాలా భయపడి పోయిందట. ఇక అప్పుడు సౌందర్య, రమ్యకృష్ణ కాలును పట్టుకొని తన ముఖం వద్ద పెట్టుకుందట. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ చెప్పడం జరిగింది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!