Home » ఆదివారం నాడు అస్సలు ఈ తప్పులు చెయ్యద్దు.. ఇంత ఇబ్బంది పడాలో తెలుసా..?

ఆదివారం నాడు అస్సలు ఈ తప్పులు చెయ్యద్దు.. ఇంత ఇబ్బంది పడాలో తెలుసా..?

by Sravya
Ad

మన హిందువులు రోజుకొక దేవుడిని ప్రత్యేకించి పూజిస్తూ ఉంటారు. ఆదివారం నాడు ప్రత్యేకించి సూర్య భగవానుని ఆరాధిస్తూ ఉంటారు. ఆదివారం నాడు చాలామంది సూర్యభగవానుడికి పూజలు చేస్తూ ఉంటారు. ఉపవాసం కూడా ఉంటారు. ఆదివారం నాడు పవిత్రంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెప్పడం జరిగింది. ఆదివారం నాడు చేయాల్సిన పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముఖ్యంగా చెప్పాలంటే సూర్యుడు అధిపతిగా ఉన్న రోజు ఆదివారం సూర్యాష్టకం లో కూడా ఆదివారం గురించి ఉంది.

Advertisement

Advertisement

ఆదివారం నాడు మాంసం తినకూడదు. ఆదివారం నాడు మద్యం తీసుకోకూడదు. ఈ రెండు తప్పులు చేయడం వలన, ఏడు జన్మల వరకు రోగస్తులు అవుతారట. జన్మజన్మలకి దరిద్రాన్ని అనుభవిస్తారట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం నాడు మద్యం మాంసం ముట్టుకోకూడదు. తలకి నూనె పెట్టుకుని తల స్నానం చేస్తే మంచిది. ఇలా చేయడం వలన వ్యాధులు రావు. దరిద్రం కూడా రాదు.

ఆదివారం నాడు ఉన్నత పదవులు చేపట్టడం, ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యల గురించి పై అధికారులకు చెప్పడం, బంగారం కొనుగోలు చేయడం, కోర్టు సమస్యలు, కుటుంబ పరమైన సమస్యలు, వ్యాపార సామాగ్రిని కొనుగోలు చేయడం, వ్యవసాయ సామాగ్రిని కొనడం వంటివి కూడా అసలు చేయకూడదని పండితులు చెప్పిన జరిగింది. ఈ రోజు మీకు వీలైతే రామాయణం చదువుకోవడం మంచిది ఎవరికైనా తోచిన సహాయం చేస్తే కూడా మంచి జరుగుతుంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading