ఈరోజుల్లో చాలామంది డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందంగా ఉండాలని ఉంటుంది అందంగా ఉండడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా అందంగా ఉండాలని అనుకుంటున్నారా, అనేక రకాల పద్ధతుల్ని పాటించినా నల్లటి వలయాలు మీ అందాన్ని తగ్గించేస్తున్నాయా..? అయితే కచ్చితంగా ఇలా చేయాల్సిందే. వీటిని తగ్గించడానికి ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి కళ్ళ కింద నల్లటి వలయాలు ఉన్నట్లయితే టమాట జ్యూస్ నిమ్మరసం బాగా పనిచేస్తాయి.
Advertisement
Advertisement
టమాట జ్యూస్ ని నిమ్మ రసం లో కలిపి మీరు కళ్ళ కింద రాసి మసాజ్ చేసినట్లయితే డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి డాగ్ సర్కిల్స్ తో బాధపడే వాళ్ళు బంగాళదుంప ముక్కల్ని జ్యూస్ కింద చేసుకుని కాటన్ బాల్ అందులో ముంచి కళ్ళ కింద ఉంచండి ఇలా చేస్తే కూడా ఈజీగా డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. గ్రీన్ టీ బ్యాగుల్ని వాటర్ లో మంచి ఫ్రిడ్జ్ లో ఉంచాలి తర్వాత కళ్ళ కింద పెట్టుకోవాలి.
ఇలా చేస్తే కూడా ఈజీగా డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. పాలల్లో దూదిని ముంచి కళ్ళ మీద కాసేపు ఉంచుకుంటే కూడా ఈ సమస్య నుండి బయట పడవచ్చు. నారింజ జ్యూస్ కూడా నల్లటి వలయాలని మచ్చల్ని పోగొట్టగలదు. కాసేపు రోజూ యోగ మెడిటేషన్ చేస్తే కూడా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా డార్క్ సర్కిల్స్ సమస్యకి ఈ ఇంటి చిట్కాలతో చెక్ పెట్టేయండి. మీ అందాన్ని మరింత పెంచేసుకోండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!