Home » Nagarjuna : నాగార్జునకు అమల ఎంత కట్నం ఇచ్చారో తెలుసా?

Nagarjuna : నాగార్జునకు అమల ఎంత కట్నం ఇచ్చారో తెలుసా?

by Bunty
Ad

 

ఒకప్పటి హీరోయిన్ అమలా గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో నాగార్జున భార్యగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అమల. సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే నాగార్జునను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమాతోనే ఒకరికొకరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. వివాహ అనంతరం అమల సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. ఇక అప్పటి నుంచి అమల కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయింది.

Amala about Akkineni Nagarjuna

Amala about Akkineni Nagarjuna

మళ్లీ కొద్ది రోజులకి సినిమాల్లోకి తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే అక్కినేని అమలకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెకు కొన్ని కోట్ల ఆస్తులు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ అమల మాత్రం చాలా సింపుల్ గా మెడలో ఒక చిన్న నల్లపూసల దండను మాత్రమే వేసుకుంటుంది. ఎంత పెద్ద పెళ్లిళ్లు, ఫంక్షన్లు అయినా సరే అమల అలానే సింపుల్ గా ఉంటారు. కనీసం ఆమె ఒంటిమీద ఒక తులం బంగారం కూడా ఉండదు. అమలకి బంగారం అంటే చాలా ఇష్టమట. కానీ స్కిన్ ఎలర్జీ ఉండడంతో నగలు వేసుకోరట. ఏవైనా ఆభరణాలు వేసుకుంటే దురద పెట్టి చర్మం అంత ఎర్రగా మారిపోతుందట.

Advertisement

Advertisement

ఇక ఆ భయంతోనే అమల నగలు వేసుకోకుండా చాలా సింపుల్ గా ఉంటారు. అమల సింపుల్ గా ఉన్నప్పటికీ అభిమానులు ఆవిడని ఎంతో ఇష్టపడతారు. ఎన్నో కోట్ల ఆస్తులు ఉన్నా కూడా చాలా సింపుల్ గా ఉంటారు అని మెచ్చుకుంటారు. ఇక అమలకి ఉన్న ఈ సమస్య గురించి నాగార్జున ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తమ పెళ్లి గురించి మాట్లాడుతూ నాగార్జున ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పడం జరిగింది. అమలగారు చాలా కోటీశ్వరులు మీకు ఎంత కట్నం ఇచ్చారు అని యాంకర్ అడగ్గా…. దానికి సమాధానంగా నాగార్జున, నేను అమల వద్ద నుంచి ఎలాంటి కట్నం తీసుకోలేదు. తాను మా ఇంటికి ఎలాంటి కట్నం తీసుకురాలేదు. కట్నం కింద కేవలం రెండు కుక్క పిల్లలను మాత్రమే అమల మా ఇంటికి తీసుకువచ్చింది అని నాగార్జున చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. స్టార్ హీరో అయ్యుండి కట్నం తీసుకోకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఇక నాగార్జున మంచి మనసుకి ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading